పిన్నవయసు మహిళా జీఎంగా బోధన
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:30 AM
పిన్నవయసు మహిళా గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యూజీఎం)గా బ్రిటన్‌కు చెందిన భారత సంతతి బాలిక బోధన శివానందన్ చరిత్ర సృష్టించింది...
న్యూఢిల్లీ: పిన్నవయసు మహిళా గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యూజీఎం)గా బ్రిటన్‌కు చెందిన భారత సంతతి బాలిక బోధన శివానందన్ చరిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్‌లో ఇంగ్లండ్ తరఫున బరిలోకి దిగిన 11 ఏళ్ల బోధన మహిళా జీఎంకు అవసరమైన మూడో నార్మ్‌ను సాధించింది. కేటర్యానా లాగ్నో (రష్యా) 12 ఏళ్ల వయసులోనే మహిళా జీఎం హోదా సాధించింది. ఈ రికార్డును బోధన తిరగరాసింది. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన బోధన తండ్రి వేలాయుధం ఐటీ సెక్టార్‌లో పనిచేస్తూ.. 2007లో భారత్‌నుంచి లండన్‌కు వలసవెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..