షెల్టన్‌కు షాక్
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:43 AM
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో రెండో రోజు మంగళవారం మహిళల విభాగంలో టాప్ సీడ్ల హవా సాగింది. అయితే పురుషుల సింగిల్స్‌లో మాత్రం మరో సంచలన ఫలితం నమోదైంది. నాలుగో సీడ్ బెన్ షెల్టన్ తొలి రౌండ్‌లోనే...
క్వాలిఫయర్ ఒట్టో చేతిలో ఓటమి
వింబుల్డన్‌లో స్వియటెక్ ముందుకు
లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో రెండో రోజు మంగళవారం మహిళల విభాగంలో టాప్ సీడ్ల హవా సాగింది. అయితే పురుషుల సింగిల్స్‌లో మాత్రం మరో సంచలన ఫలితం నమోదైంది. నాలుగో సీడ్ బెన్ షెల్టన్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ఐదు సెట్ల హోరాహోరీ పోరులో క్వాలిఫయర్ ఒట్టో విర్టానెన్ (ఫిన్లాండ్) 6-4, 3-6, 7-6, 6-2, 7-6తో షెల్టన్‌పై గెలిచాడు. మరోవైపు మహిళల విభాగం తొలి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వియటెక్ (స్పెయిన్) 6-1, 2-6, 6-3తో టౌన్‌సెండ్ (యూఎ్‌సఏ)పై, రెండో సీడ్ ఎలెనా రిబకినా (కజకిస్థాన్) 6-4, 1-6, 6-3తో బోయిసన్ (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ అనిసిమోవా (యూఎస్) 6-3, 6-2తో జోర్‌చెస్కా (మాసిడోనియా)పై, మాడిసన్ కీస్ (యూఎస్) 6-7, 6-4, 6-3తో కైలా డే (యూఎ్‌స)పై గెలిచారు. అయితే 8వ సీడ్ స్విటోలినా 5-7, 2-6తో డారియా స్నిగుర్ (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. పురుషుల్లో ఐదో సీడ్ డిమినార్ (ఆసీస్) 7-6, 6-1, 6-0తో బురుచాగ (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ ఫ్రిట్జ్ (యూఎస్) 6-3, 6-4, 6-3తో లజోవిక్ (సెర్బియా)పై నెగ్గి రెండో రౌండ్ చేరారు.
ఇవి కూడా చదవండి
అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం
ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు