బెల్జియం గర్జన
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:25 AM
రెడ్ డెవిల్స్ గర్జించడంతో.. మూడో ఆతిథ్య దేశం అమెరికా కూడా మెగా ఈవెంట్ నుంచి అవుటైంది. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం 4-1తో అమెరికాను చిత్తు చేసింది. చార్లెస్ డి కెటలరె...
ప్రీక్వార్టర్స్‌లోఅమెరికా చిత్తు
సియాటెల్: రెడ్ డెవిల్స్ గర్జించడంతో.. మూడో ఆతిథ్య దేశం అమెరికా కూడా మెగా ఈవెంట్ నుంచి అవుటైంది. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం 4-1తో అమెరికాను చిత్తు చేసింది. చార్లెస్ డి కెటలరె (9వ, 33వ నిమిషం) డబుల్ ధమాకా సృష్టించగా.. హన్స్ వనాకెన్ (57వ), రొమేలు లుకాకు (90+3వ) చెరో గోల్ సాధించారు. అమెరికా తరఫున మాలిక్ టిల్మన్ (31వ) ఏకైక గోల్ చేశాడు. రెడ్‌కార్డ్‌ను వెనక్కితీసుకోవడంతో అమెరికా ఫార్వర్డ్ ఫొలారిన్ బలోగన్ బరిలోకి దిగాడు. ఈ పరిణామం రెడ్ డెవిల్స్‌ను మరింతగా రెచ్చగొట్టిందేమో తెలియదు కానీ.. టోర్నీలో గత నాలుగు మ్యాచ్‌ల్లో తడబడిన బెల్జియం.. ఈ మ్యాచ్‌లో కసిగా ఆడింది. అమెరికా డిఫెన్స్ లోపాలను సొమ్ముచేసుకొంటూ గోల్స్ వర్షం కురిపించింది. మ్యాచ్ ఆరంభమైన 9వ నిమిషంలోనే చార్లెస్ గోల్ చేసి షాకిచ్చాడు. అయితే, 31వ నిమిషంలో టిల్మన్ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచి 1-1తో స్కోరు సమం చేశాడు. రెండు నిమిషాల తర్వాత చార్లెస్ పెనాల్టీ ఏరియాలో అద్భుత హెడర్‌తో బెల్జియం ఆధిక్యాన్ని పెంచాడు. ఇక, సెకండాఫ్ 57వ నిమిషంలో బంతిని నియంత్రించేందుకు డి-బాక్స్ బయటకు వచ్చిన అమెరికా కీపర్ మాట్ ఫ్రీస్ తడబడడ్డాడు. దీంతో బాల్‌ను దొరకబుచ్చుకొన్న వనాకెన్ 35 గజాల దూరం నుంచి కొట్టిన కిక్.. నేరుగా గోల్‌లో పడింది. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా ఆ వచ్చిన వెటరన్ స్ట్రయికర్ రుమేలు లుకాకు ఇంజ్యూరీ టైమ్‌లో బెల్జియానికి నాలుగో గోల్ అందించాడు.
ఇవి కూడా చదవండి:
45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!
తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!