Share News

తాన్య శుభారంభం

ABN , Publish Date - Jul 03 , 2026 | 01:41 AM

యువ షట్లర్‌ తాన్య హేమంత్‌ కెనడా ఓపెన్‌ సూపర్‌ 300 ఈవెంట్‌లో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో తాన్య...

తాన్య శుభారంభం

మార్కం (కెనడా): యువ షట్లర్‌ తాన్య హేమంత్‌ కెనడా ఓపెన్‌ సూపర్‌ 300 ఈవెంట్‌లో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో తాన్య 21-16, 21-18తో దిశా గుప్తా (అమెరికా)పై విజయం సాధించింది. అయితే తొలిరౌండ్‌లో 21-14, 21-12తో అన్నా టట్రానోవా (ఫ్రాన్స్‌)పై గెలిచిన ఆకర్షి కశ్యప్‌కు ప్రీక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అమెరికాకు చెందిన ఝాంగ్‌ 20-22, 21-17, 21-17 స్కోరుతో ఆకర్షిని ఓడించింది. తెలుగు షట్లర్‌ వలిశెట్టి శ్రియాన్షి 9-21, 18-21తో హువాంగ్‌ చింగ్‌ పి (చైనీస్‌ తైపీ), దేవికా సిహాగ్‌ 14-21, 15-21తో టుంగ్‌ టాంగ్‌ (చైనీస్‌ తైపీ), రక్షిత రామ్‌రాజ్‌ 15-21, 21-14, 21-15తో రాచెల్‌ చాన్‌ (కెనడా) చేతిలో ఓటమి పాలయ్యారు. వీరితో పాటు అన్మోల్‌ ఖర్బ్‌, సనీత్‌ దయానంద్‌, శంకర్‌ సుబ్రమణియన్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.

ఈ వార్తలనూ చదవండి:

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

Updated Date - Jul 03 , 2026 | 01:41 AM