Share News

మీరాబాయి చానుకు సిల్వర్.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్ పతకం..

ABN , Publish Date - Sep 23 , 2026 | 02:10 PM

ఎట్టకేలకు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో పతకం సాధించింది. జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 49 కిలోల విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది.

మీరాబాయి చానుకు సిల్వర్.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్ పతకం..
Mirabai Chanu

ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో పతకం సాధించింది. జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 49 కిలోల విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది. మొత్తం 198 కిలోలు బరువును ఎత్తిన మీరాబాయి.. ఆసియా క్రీడల్లో తన తొలి పతకాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత పతకం లభించింది (Mirabai Chanu Silver).


మీరాబాయి చాను మహిళల 49 కిలోల విభాగంలో స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోలు ఎత్తింది. దీంతో ఆమె మొత్తం 198 కిలోల స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 83 కిలోలతో ప్రారంభించి.. ఆ తర్వాత 85, 87 కిలోల బరువులను ఎత్తింది. క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోల బరువును ఎత్తి రజతాన్ని ఖాయం చేసుకుంది. ఈ విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్ గమ్ స్వర్ణ పతకం సాధించారు. ఆమె మొత్తం 215 కిలోలు ఎత్తింది (Women's 49kg Weightlifting).


ఆసియా క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ పతకం కోసం ఎదురుచూస్తున్న భారత్ 28 ఏళ్ల నిరీక్షణకు తాజాగా మీరాబాయి తెరదించింది (India Asian Games). 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించిన తర్వాత భారత్‌కు ఈ క్రీడలో మరో ఆసియా క్రీడల పతకం రాలేదు. మీరాబాయి చాను ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలోనూ పతకాలు గెలుచుకుంది. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం ఇదే తొలి పతకం.


ఇవి కూడా చదవండి..

భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..


రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Sep 23 , 2026 | 02:20 PM