ప్రతాప్ వరల్డ్ రికార్డు
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:15 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3పీ పోటీలో...
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3పీ పోటీలో ప్రతాప్ 362 స్కోరుతో వరల్డ్ రికార్డును తిరగరాయడంతో పాటు స్వర్ణం సాధించాడు. నీరజ్ 361.8 పాయింట్లతో రజతం, అఖిల్ షీయోరన్ 343.5 పాయింట్లతో కాంస్యం నెగ్గారు. టీమ్ ఈవెంట్‌లో ప్రతాప్, నీరజ్, అఖిల్ త్రయం 1769 స్కోరుతో పసిడి కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్
కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..