Share News

ఆర్యవీర్‌ భారీ శతకం

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:36 AM

ఓపెనర్‌ ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160) మ్యాచ్‌ విన్నింగ్‌ శతకంతో చెలరేగడంతో...

ఆర్యవీర్‌ భారీ శతకం

అండర్‌-19 ఆసియా కప్‌

  • సెమీ్‌సలో యువ భారత్‌

  • యూఏఈపై గెలుపు

  • ఇషాన్‌కు 4 వికెట్లు

అల్‌ అమీరత్‌ (ఒమన్‌): ఓపెనర్‌ ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160) మ్యాచ్‌ విన్నింగ్‌ శతకంతో చెలరేగడంతో.. అండర్‌-19 ఆసియాకప్‌లో భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఎలో మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో యువ భారత్‌ 70 పరుగుల తేడాతో యూఏఈపై గెలిచింది. మొత్తం నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో చోటు కోసం గురువారం జరిగే సెమీస్‌లో అఫ్ఘానిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 309/7 స్కోరు చేసింది. వినీత్‌ (67) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. నసీమ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో యూఏఈ 50 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్‌ ఖుదాదాద్‌ (74), నూరుల్లా అయూబ్‌ (39) టాప్‌ స్కోరర్లు. ఇషాన్‌ సూద్‌ 4 వికెట్లు తీశాడు.

సంక్షిప్త స్కోర్లు:

భారత్‌ అండర్‌-19: 50 ఓవర్లలో 309/7 (ఆర్యవీర్‌ 160, వినీత్‌ 67; నసీమ్‌ 4/48).

యూఏఈ అండర్‌-19: 50 ఓవర్లలో 239 ఆలౌట్‌ (ఖుదాదాద్‌ 74, నూరుల్లా 39; ఇషాన్‌ 4/37).

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:36 AM