Share News

అర్జున్‌కు మళ్లీ అన్యాయం

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:09 AM

భారత నెంబర్‌వన్‌ ఆటగాడు అర్జున్‌ ఇరిగేసికి గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో మరోసారి అన్యాయం జరిగింది. మొత్తం 9 మంది ఆటగాళ్లు మాత్రమే...

అర్జున్‌కు మళ్లీ అన్యాయం

గ్రాండ్‌ చెస్‌ టూర్‌కు ఆహ్వానం లేదు

న్యూఢిల్లీ: భారత నెంబర్‌వన్‌ ఆటగాడు అర్జున్‌ ఇరిగేసికి గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో మరోసారి అన్యాయం జరిగింది. మొత్తం 9 మంది ఆటగాళ్లు మాత్రమే పోటీపడే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో అర్జున్‌కు ఈసారీ ఆహ్వానం అందలేదు. భారత్‌ నుంచి ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌, ప్రజ్ఞానందలను వరుసగా మూడోసారి టోర్నీకి ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహక ‘ది సెయింట్‌ లూయిస్‌ చెస్‌ క్లబ్‌’ ప్రకటించింది. అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌ తరపున అత్యధిక రేటింగ్‌ ఆటగాడిగా ఉన్నా కూడా అర్జున్‌ను ఈ టోర్నీకి పరిగణించకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి

మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్

బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ

Updated Date - Jan 29 , 2026 | 07:06 AM