Share News

అంకిత అత్యుత్తమ ప్రదర్శన

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:48 AM

భారత అథ్లెట్‌ అంకిత ధ్యాని అమెరికా గడ్డపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ చాలెంజర్‌ ఈవెంట్‌లో...

అంకిత అత్యుత్తమ ప్రదర్శన

పోర్ట్‌లాండ్‌ : భారత అథ్లెట్‌ అంకిత ధ్యాని అమెరికా గడ్డపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ చాలెంజర్‌ ఈవెంట్‌లో భాగంగా ఇక్కడ జరిగిన స్టంప్‌టౌన్‌ ట్విలైట్‌ టోర్నీ మహిళల 1500 మీటర్ల రేసులో 24 ఏళ్ల అంకిత 4:06.75 సెకన్ల టైమింగ్‌తో రెండోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గతంలో తాను నమోదుచేసిన (4:12.28 సె) వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను మరింత మెరుగుపరచుకుంది. అంతేకాదు.. ఈ సీజన్‌లో ఓ భారత అథ్లెట్‌కు ఇదే వేగవంతమైన టైమింగ్‌ కాగా, ఓవరాల్‌గా ఆసియా తరఫున మూడో వేగవంతమైన టైమింగ్‌.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియాపై గెలుపు .. స్పందించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌

Updated Date - Aug 17 , 2026 | 05:48 AM