అల్జీరియా 12 ఏళ్ల తర్వాత..
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:48 AM
తొలి అర్ధ భాగంలో వెనుకబడినా ద్వితీయార్ధంలో రెండు కార్నర్ కిక్‌లను గోల్స్‌గా మలచిన అల్జీరియా.. 12 ఏళ్ల తర్వాత వరల్డ్‌క్‌పలో తొలి విజయాన్ని నమోదు చేసింది....
శాంటా క్లారా: తొలి అర్ధ భాగంలో వెనుకబడినా ద్వితీయార్ధంలో రెండు కార్నర్ కిక్‌లను గోల్స్‌గా మలచిన అల్జీరియా.. 12 ఏళ్ల తర్వాత వరల్డ్‌క్‌పలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో నాకౌట్ చేరే అవకాశాలను మెరుగుపర్చుకొంది. గ్రూప్-జెలో జరిగిన మ్యాచ్‌లో అల్జీరియా 2-1తో జోర్డాన్‌పై నెగ్గింది. 36వ నిమిషంలో నిజర్ అల్‌రష్దాన్ గోల్‌తో జోర్డాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన నాదిర్ బెన్‌బౌలీ.. 69వ నిమిషంలో కార్నర్ కిక్‌ను హెడర్‌తో గోల్‌లోకి పంపి స్కోరు సమం చేశాడు. 82వ నిమిషంలో అమిన్ గుయిరి మరో గోల్ చేసి అల్జీరియాను గెలిపించాడు. 2014లో అల్జీరియా చివరిసారి వరల్డ్‌క్‌పలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. కాగా, వరుసగా రెండు ఓటములతో జోర్డాన్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి