52 ఏళ్లలో తొలిసారి.. నెం.1 ర్యాంక్‌తో జ్వెరెవ్ రికార్డు
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:54 AM
జర్మన్ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కెరీర్‌లో తొలిసారి నెం:1 ర్యాంక్‌ను అందుకొన్నాడు...
పెద్దోడు
న్యూఢిల్లీ: జర్మన్ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కెరీర్‌లో తొలిసారి నెం:1 ర్యాంక్‌ను అందుకొన్నాడు. అంతేకాకుండా గడచిన 52 ఏళ్లలో మొదటిసారి ఈ ఘనతను అందుకొన్న పెద్ద వయస్కుడిగా 29 ఏళ్ల జ్వెరెవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 1974లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ న్యూకాంబీ (30 ఏళ్లు) లేటు వయసులో తొలిసారి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. బోరిస్ బెకర్ తర్వాత నెం:1 ర్యాంక్‌ను సాధించిన రెండో జర్మన్ ప్లేయర్ జ్వెరెవ్.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!
ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..
అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..