Share News

లాడ్జిలో ప్రియుడితో కూతురు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:01 PM

లాడ్జి రూములో ప్రియుడితో ఉన్న కూతురిని ఓ తల్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తప్పు చేస్తూ దొరికిపోయిన కూతురిని, ఆమె ప్రియుడిని చావగొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లాడ్జిలో ప్రియుడితో కూతురు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి ఏం చేసిందంటే..
lodge raid video

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రియుడితో లాడ్జి రూములో ఉన్న కూతురిని ఓ తల్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తప్పు చేస్తూ దొరికిపోయిన కూతురిని, ఆమె ప్రియుడిని చావగొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ తన కొడుకు, లేడీ పోలీస్ అధికారితో లాడ్జిలోని 102 రూము దగ్గరకు వచ్చింది. లేడీ పోలీస్ తలుపు తట్టగా.. లోపలినుంచి యువతి తలుపు తీసింది. బయట తల్లిని చూడగానే ఆ యువతి భయపడిపోయింది. ఆ మహిళ కోపంగా గదిలోకి వెళ్లింది.


కూతురు ఏదో చెప్పడానికి ప్రయత్నించినా ఆమె పట్టించుకోలేదు. లోపల ఓ మూలకు యువకుడు కనిపించటంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. కూతురి చెయ్యి పట్టి లాగి చెంపపై కొట్టసాగింది. ఇంతలో ఆ యువకుడు మహిళ దగ్గరకు వచ్చాడు. ప్రియురాలిని కొట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో ఆ మహిళ ఆ యువకుడిపై దాడి చేసింది. ప్రేమికులిద్దరినీ చావగొట్టింది. అయితే, ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్నది తెలియరాలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆ వీడియో స్క్రిప్టెడ్ అని అంటున్నారు.


‘సోషల్ మీడియాలో వ్యూస్, ఫేమ్ కోసం ఇంత దిగజారుతారా?. అదంతా ఫేక్. ఆ మహిళ ఎలా కొడుతుందో చూస్తే అసలు విషయం అర్థం అవుతుంది’..‘ వ్యూస్ కోసం ఎంతకు తెగించారు’..‘ఇలా ఫేక్ వీడియోలు చేసే వారిని ఊరికే వదిలిపెట్టకూడదు’ అంటూ కొంతమంది ఫైర్ అవుతున్నారు. ‘చదువుకొమ్మని పంపిస్తే ఇలా ప్రియుడితో తిరుగుతావా. నీకు ఇంకా దెబ్బలు పడాలి’..‘ఆ అమ్మాయికి, అబ్బాయికి వెంటనే పెళ్లి చెయ్యండి. అప్పుడు బుద్ధి వస్తుంది’ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు

మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దందా గుట్టురట్టు

Updated Date - Apr 19 , 2026 | 12:06 PM