కల్లో కూడా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు..
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:55 PM
ఓ యువకుడు తన తల్లికి కల్లో కూడా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తల్లికి ఎంతగానో ఇష్టమైన క్రికెటర్‌ను ఆమె దగ్గరకు తీసుకువచ్చాడు. తనకిష్టమైన క్రికెటర్‌ను చూడగానే తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ యువకుడు తన తల్లికి కల్లో కూడా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తల్లికి ఎంతగానో ఇష్టమైన క్రికెటర్‌ను ఆమె దగ్గరకు తీసుకువచ్చాడు. తనకిష్టమైన క్రికెటర్‌ను చూడగానే తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గోవాకు చెందిన ఓ మహిళకు చిన్నప్పటినుంచి స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని తరచుగా తన కొడుకు హర్షిత్‌కు చెబుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే హర్షిత్ తన తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కొద్దిరోజుల క్రితం హర్షిత్ తన తల్లీతో కలిసి జిమ్‌కు వెళ్లాడు.
వర్కవుట్లు చేస్తుండగా జాంటీ రోడ్స్ అక్కడికి వచ్చాడు. అతడిని చూసి హర్షిత్ తల్లి ఆశ్చర్యపోయింది. జాంటీ రోడ్స్ నేరుగా ఆమె దగ్గరకు వచ్చాడు. దీంతో ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. జాంటీ రోడ్స్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లిపోయే ముందు టీ షర్ట్‌పై సంతకం చేసి ఆమెకు ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను హర్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘ఆమె సంతోషం చూస్తే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నీలాంటి కొడుకులు ఉంటే తల్లులు సంతోషంగా ఉంటారు’..‘ఈ రోజు నేను చూసిన ది బెస్ట్ వీడియో ఇదే. చాలా సంతోషంగా ఉంది’..‘జాంటీ రోడ్స్ అంటే నైంటీస్ కిడ్స్‌కు చాలా ఇష్టం. అతడిని గాడ్ ఆఫ్ ఫీల్డింగ్ అంటారు’..‘జాంటీ రోడ్స్‌కు ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే సంవత్సరంలో కొన్ని నెలల పాటు గోవాలో ఉంటారు. గోవా అంటే ఆయనకు ఎంతో ఇష్టం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
ప్రజల ఓటింగ్ హక్కులు లాక్కోనివ్వం..చివరి వరకూ పోరాడుతాం