Share News

Optical Illusion: మీ దృష్టి గొప్పదైతే.. ఈ పార్క్‌లో ఉన్న కుక్కను 15 సెకెన్లలో కనిపెట్టండి!

ABN , Publish Date - Jan 10 , 2026 | 08:47 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.

Optical Illusion: మీ దృష్టి గొప్పదైతే.. ఈ పార్క్‌లో ఉన్న కుక్కను 15 సెకెన్లలో కనిపెట్టండి!
Optical Illusion

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్స్ పజిల్. ఆ ఫొటోలో ఒక అందమైన పార్క్ కనబడుతోంది. చెట్లు, ఆకులు ఉన్నాయి. అయితే ఆ పార్క్‌లో ఒక కుక్క కూడా ఉంది. ఆ కుక్క ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 15 సెకెన్ల వ్యవధిలో ఆ కుక్కను కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 15 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ పార్క్‌లో కుక్క ఎక్కడుందో తెలుస్తుంది.

puzzle2.jpg


ఇవి కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jan 10 , 2026 | 08:47 AM