ఏమరపాటు ఎంత పని చేసింది.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:12 PM
ఏమరపాటు కారణంగా జరిగే అనర్థాలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: కొన్ని సార్లు ఏమరుపాటు కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఏమరపాటు కారణంగా జరిగే అనర్థాలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. దేవుడి గూడు దగ్గర ఉన్న డైనింగ్ టేబుల్ మీద హారతి పళ్లెం పెట్టి ఉంది. ఓ యువతి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. దేవుడి గూడు దగ్గర ఏదో వస్తువు కోసం వెతకసాగింది.
హారతి పళ్లెం ఆమె పక్కనే ఉంది. ఆమె వస్తువు కోసం వెతుకుతున్న సమయంలో జడ హారతి పళ్లెంపై పడింది. వెంట్రుకలకు నిప్పంటుకుంది. మంటలు రావటంతో ఆ యువతి వెనక్కు చూసుకుంది. వెంట్రుకలు కాలిపోవటం గుర్తించి వెంటనే అప్రమత్తం అయింది. జడను ముందుకు లాగి మంటలను ఆర్పేసింది. ఆ యువతి సరైన సమయంలో మంటలను గుర్తించి ఉండకపోయి ఉంటే.. దుస్తులకు ఆ మంటలు వ్యాపించి ఉండేవి. ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉండేది.
ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్నది తెలియరాలేదు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఏమరపాటు కారణంగా ప్రాణాలు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి‘.. ‘ఆమె అదృష్టం చాలా బాగుంది. దస్తులు అంటుకోలేదు’..‘ఏదైనా పని చేేసే ముందు అటు, ఇటు చూసుకోవాలి. లేదంటే ఇలానే జరుగుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.