ఎలాన్ మస్క్‌పై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్ర
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:54 PM
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ షేర్లు మార్కెట్‌లోకి రావటంతో ఆయన ఆస్తి విలువ అమాంతం పెరిగిపోయింది. మస్క్ ఆస్తి ట్రిలియన్ డాలర్లను దాటేసింది. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మస్క్ విజయ ప్రయాణాన్ని ప్రశంసించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ఎలాన్ మస్క్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల వ్యక్తి అంటూ మహీంద్ర కొనియాడారు. ఆవిష్కరణలు, దూరదృష్టితో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహీంద్రా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది: హోంమంత్రి అనిత
ఆధార్ కార్డు దుర్వినియోగంపై పిటిషన్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు