ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు!

ABN, Publish Date - Mar 14 , 2026 | 04:13 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి (మార్చి 14) నుంచి పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి, హైదరాబాద్ లోని పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు! 1/7

విద్యార్థుల జీవితంలో కీలక ఘట్టమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు! 2/7

లింగంపల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి.

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు! 3/7

కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్షా సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా సిసి కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు! 4/7

స్థానిక పోలీసులు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగిసింది.

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు! 5/7

అధికారులు నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేశారు. ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు.

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు! 6/7

పలు కేంద్రాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయి.

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు: కేంద్రాల వద్ద సందడి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు! 7/7

వచ్చే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఎలక్ట్రానిక్ వాచ్‌లు ఫోన్లు తీసుకురాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తదుపరి పరీక్ష (సెకండ్ లాంగ్వేజ్) మార్చి 18న జరగనుంది.

Updated at - Mar 14 , 2026 | 04:14 PM