బోయినపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి
ABN, Publish Date - Jan 13 , 2026 | 01:06 PM
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బోయినపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొని, చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేశారు. అనంతరం కోడి పుంజుల కొట్లాట కార్యక్రమంలో పాల్గొంటూ జనంతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
1/6
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజులు ముందుగానే హైదరాబాద్‌లో పండుగ సందడి మొదలైంది.
2/6
మాజీ మంత్రి మల్లారెడ్డి సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనంతో కలిసి సందడి చేస్తున్నారు.
3/6
తాజాగా, బోయినపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు.
4/6
ఈ సందర్భంగా చిన్నారులకు గాలి పటాలు పంపిణీ చేశారు. అనంతరం కోడి పుంజుల కొట్లాటను వీక్షించారు.
5/6
సంక్రాంతి పోటీల్లో విజయం సాధించిన వారికి మల్లారెడ్డి బహుమతులను అందజేశారు.
6/6
మల్లారెడ్డి కూడా అక్కడి వారితో కలిసి గాలి పటాలను ఎగురవేశారు.
Updated at - Jan 13 , 2026 | 01:06 PM