హైదరాబా‌ద్‌లో భారీ వర్షం..

ABN, Publish Date - Mar 24 , 2026 | 09:35 PM

ఇవాళ(మంగళవారం) సాయంత్రం అకస్మాత్తుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబా‌ద్‌లో భారీ వర్షం.. 1/7

ఇవాళ(మంగళవారం) సాయంత్రం అకస్మాత్తుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబా‌ద్‌లో భారీ వర్షం.. 2/7

ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబా‌ద్‌లో భారీ వర్షం.. 3/7

గచ్చిబౌలి వంతెనపై, ఐకియా, రాయదుర్గం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మణికొండలో వడగళ్ల వాన కురిసింది.

హైదరాబా‌ద్‌లో భారీ వర్షం.. 4/7

యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్‌లో రహదారులను వాన నీరు ముంచెత్తింది. పలు కాలనీలు చెరువులను తలపించాయి.

హైదరాబా‌ద్‌లో భారీ వర్షం.. 5/7

బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌ నగర్, లక్డీకాపుల్‌, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో రహదారులపై వాన నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబా‌ద్‌లో భారీ వర్షం.. 6/7

వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల మేరకు రాబోయే గంటల్లో కూడా నగరంలో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

హైదరాబా‌ద్‌లో భారీ వర్షం.. 7/7

ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Updated at - Mar 24 , 2026 | 09:35 PM