సికింద్రాబాద్‌లో పెట్రోల్, గ్యాస్ కష్టాలు.. క్యూలైన్‌లో బారులు తీరిన జనం
ABN, Publish Date - Mar 26 , 2026 | 03:18 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో గ్యాస్, ఆయిల్ కొరత తీవ్రమైంది. జనాన్ని గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోగా.. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల విషయంలో వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు.
1/7
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో గ్యాస్, ఆయిల్ కొరత తీవ్రమైంది. జనాన్ని గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి.
2/7
దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోగా.. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల విషయంలో వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు.
3/7
సికింద్రాబాద్‌లో గ్యాస్ కోసం జనాలు క్యూ లైన్‌లో బారులు తీరారు. గంటల పాటు క్యూలైన్‌లో ఉండి గ్యాస్ తీసుకెళ్లారు.
4/7
అయితే, కొంతమందికి మాత్రం గంటలు, గంటలు క్యూలైన్‌లో ఉన్నా గ్యాస్ దక్కని పరిస్థితి ఏర్పడింది. వారు నిరాశతో వెనుదిరగక తప్పలేదు.
5/7
రాష్ట్రంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
6/7
పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు.
7/7
అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదారుడికి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు.
Updated at - Mar 26 , 2026 | 03:18 PM