ఆగస్టు 15లోపు రాష్ట్రవ్యాప్తంగా సంజీవని.. ఇంటినుంచే 74 రకాల వైద్య పరీక్షలు
ABN, Publish Date - May 23 , 2026 | 05:10 PM
ప్రపంచస్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆగస్టు 15 లోపే రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
1/10
చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.
2/10
ప్రపంచస్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
3/10
ఆగస్టు 15 లోపే రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ ఉంటారని తెలిపారు.
4/10
'సంజీవని' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్సార్సీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
5/10
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గొడ్డలి పార్టీ బుద్ధి మారట్లేదన్నారు. "సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
6/10
రప్పారప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా? సీబీఎన్ దగ్గర తోక జాడిస్తే, ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు.
7/10
గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటు లేదని సీఎం అన్నారు.
8/10
‘అభివృద్ధి సంక్షేమంతోపాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకొక నాటకమాడుతున్నారు‘ అంటూ మండిపడ్డారు.
9/10
ప్రస్తుతం ప్రజలకు విద్య, వైద్య ఖర్చులు భారంగా మారాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు.
10/10
అధిక సంతానం అంశంలో తన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారని చెప్పుకొచ్చారు. పిల్లలే తల్లిదండ్రులకు అసలైన ఆస్తి.. అందుకే పిల్లలను కనాలని చెబుతున్నానని అన్నారు.
Updated at - May 23 , 2026 | 05:10 PM