ఏపీలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.. పరీక్షా కేంద్రాల దగ్గర విద్యార్థుల సందడి
ABN, Publish Date - Mar 16 , 2026 | 09:37 PM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు ( సోమవారం) ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
1/9
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు ( సోమవారం) ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి.
2/9
ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
3/9
ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది పరీక్షలు రాయనుండగా.. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22,074 మంది, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు.
4/9
బాలురు 3,28,652, బాలికలు 3,12,264. రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
5/9
38,958 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. సమస్యాత్మకంగా గుర్తించిన 210 కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
6/9
అలాగే 156 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు.
7/9
ఉదయం 8.45 గంటల్లోపే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచిస్తోంది.
8/9
తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 10 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 10 తర్వాత ఎవరినీ పరీక్ష హాలులోకి అనుమతించరు.
9/9
పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఏ మాత్రం ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి అంటూ విద్యార్థులకు ఆయన కీలక సూచన చేశారు.
Updated at - Mar 16 , 2026 | 09:45 PM