Share News

యాన్బూలో తెలుగు వారి ఆత్మీయ కలయికగా దసరా, బతుకమ్మ వేడుకలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:24 PM

సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం తీరంలోగల యాన్బూ అనే పారిశ్రామిక నగరంలో శుక్రవారం తెలుగు ప్రవాసీ కుటుంబాలు జరుపుకున్న దసరా-బతుకమ్మ వేడుకలలో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాయి.

యాన్బూలో తెలుగు వారి ఆత్మీయ కలయికగా దసరా, బతుకమ్మ వేడుకలు
Telugu Diaspora Celebrates Dasara and Bathukamma Festivals

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఒకరిద్దరు చేసుకొంటే వ్యక్తిగత విందు.. అందరూ కలిసి చేసుకొంటే పండుగ.. మాతృభూమికి దూరంగా అరబ్బునాట అందరూ కలిసి ఆనందోత్సాహంతో చేసుకునే పండుగ ఒక మధుర అనుభూతి.

సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం తీరంలోగల యాన్బూ అనే పారిశ్రామిక నగరంలో శుక్రవారం తెలుగు ప్రవాసీ కుటుంబాలు జరుపుకున్న దసరా-బతుకమ్మ వేడుకలలో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాయి.

2.jpg

సౌదీ అరేబియాలోని మదీన రాష్ట్రంలోని యాన్బూ నగరం చమురు అనుబంధ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఎర్ర సముద్రం తీరంలో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలకు నౌకాయాన మార్గం మధ్యలో ఇది ఉంది. ఇక్కడి వృత్తి నిపుణులయిన భారతీయులలో తెలుగు ప్రవాసీయులు అనేక మంది ఉన్నారు. వీరిలో అనేక మంది దసరా బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సౌదీలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు తమ ఆచారాలకు అనుగుణంగా ఆత్మీయ కలయికగా జరుపుకున్నాయి.

3.jpg


ఏడేళ్ల మేధాంశ్ సంపత్ రావు, పుట్టింది గుజరాత్‌లో పెరుగుతోంది సౌదీ అరేబియాలో. అతని తండ్రి వేణు కూడా గుజరాత్‌లో పుట్టి పెరిగాడు కానీ వారి తాత మూలాలు విశాఖపట్టణంలో ఉన్నాయి. తరాలు మారినా తెలుగును మరిచిపోలేదు, తెలుగు పండుగలను మరిచిపోలేదు. ఈ తరహాలో అనేక మంది కుటుంబ సమేతంగా వేడుకలలో ఉత్సాహంగా పాల్గొని పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశారు. యాన్బూ తరహా ప్రాంతంలో కూడా తెలుగు పండుగలు ఈ రకమైన వైభవంగా జరుగుతాయని ఊహించలేదని కొద్ది కాలం క్రితం ఇక్కడకు వచ్చిన నిజామాబాద్‌కు చెందిన సంజయ్, విశాఖపట్టణానికి చెందిన సతీష్ వ్యాఖ్యానించారు.

4.jpg


యాన్బూలోని తెలుగు ప్రవాసీ ప్రముఖులు కాశీరాజ్ కమ్మరి, రషీద్ ఖాన్, టాటా మాటూరి, రవి, ప్రకాష్, వేణు, రాము, విజయ్, అవినాష్, ప్రభాకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలలో స్త్రీ శక్తి పరమార్థంగా జరిగిన అమ్మవార్ల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. దీన్ని చిన్నార్లు తనిష్క, మహిత కావేష్, ఉన్సి మాన్వి, రుత్విక, రమీజ్, లక్షిత, స్ఫూర్తి, జస్విత కృతిలు ప్రదర్శించగా కవిత కమ్మరి దర్శకత్వం వహించారు. బతుకమ్మలను కబడ సంప్రదాయ ఆటపాటలతో నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సౌదీలోని ప్రముఖ తెలుగు గాయకులు అంజద్, గోపిలు తమ మధుర పాటలతో సభికులను అలరించారు.

5.jpg


ఈ వార్తలనూ చదవండి:

ఘనంగా ప్రారంభమైన తానా మిడ్-అట్లాంటిక్ యూత్ ఫుడ్ డ్రైవ్-2026

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్‌నకు షాక్ తప్పదా?

Updated Date - Oct 31 , 2026 | 06:37 PM