Share News

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్‌నకు షాక్ తప్పదా?

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:49 PM

అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల్లో దక్షిణాసియా సంతతి ప్రజలు అధ్యక్షుడు ట్రంప్ సారథ్యంలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్‌నకు షాక్ తప్పదా?
Southasians in Texas Prefer Democrates

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల్లో దక్షిణాసియా సంతతి ప్రజలు అధ్యక్షుడు ట్రంప్ సారథ్యంలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌లో జరగనున్న సెనేట్ ఎన్నికలతో పాటు గవర్నర్ రేసులో దక్షిణాసియా వారు ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. సౌత్ ఏషియన్ అమెరికన్ ఓటర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ టెక్సాస్ ఎడ్యుకేషన్ ఫండ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియేగో సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి.


సర్వే ప్రకారం, దక్షిణాసియా సంతతికి చెందిన ఓటర్లలో 66 శాతం మంది సెనేట్ రేసులో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ టెలరీకో వైపు మొగ్గు చూపారు. కేవలం 21 శాతం మందే అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన కెన్ పాక్స్‌టన్‌కు మద్దతు పలికారు. ఇక గవర్నర్ రేసులో పోటీపడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి జీనా హినొజోసాకు 63 మంది మద్దతు పలకగా అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గ్రెగ్ ఆబట్‌కు 27 మంది అనుకూలంగా ఉన్నారు.


కారణాలు ఇవీ..

గత ఏడాది కాలంగా టెక్సాస్‌లో అనేక విద్వేషపూరిత ఘటనలు జరిగాయని సర్వేలో పాల్గొన్న 58 శాతం మంది చెప్పారు. ఆన్ లైన్ వేధింపులు, ప్రార్థనా స్థలాల వంటి వాటిని టార్గెట్ చేశామన్న బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. జాతి, మతం, యాస ఆధారిత విద్వేషం ఎదుర్కొన్నట్టు సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. దక్షిణాసియా వారు బయటివారని, ఆక్రమణదారులని సంబోధించిన ఉదంతాలు కూడా చూశామని 64 శాతం మంది చెప్పారు. ‘పాలకులే ద్వేషానికి ఆజ్యం పోస్తే ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుంది. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం సడలుతుంది’ అని ఓ దక్షిణాసియా సంతతి వ్యక్తి హెచ్చరించారు.


రాజకీయంగా కూడా తమకు ఆదరణ దక్కడం లేదని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది చెప్పారు. తమకు రాజకీయంగా పలుకుబడి చాలా స్వల్పమని 54 శాతం మంది తెలిపారు. పౌర స్పృహ కలిగిన ఓ వర్గం రాజకీయంగా వెలివేతకు గురవుతున్న వైనం సర్వేలో కనబడుతోందని యూసీ శాన్‌డియేగో ఇమిగ్రేషన్ పాలసీ కేంద్రం ఫౌండింగ్ డైరెక్టర్ టామ్ కే వాంగ్ పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణ మూలాలున్న మహిళ

ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు - హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య భాగస్వామ్యం

Updated Date - Oct 30 , 2026 | 03:26 PM