Share News

ఖతర్‌లో ‘తెలంగాణ వైభవం’ వేడుకలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:33 PM

ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీయులు తెలంగాణ వైభవం-26 ఉత్సవాలను ఆనందభరితంగా నిర్వహించారు.

ఖతర్‌లో ‘తెలంగాణ వైభవం’ వేడుకలు
Telangana Vaibhavam - 2026

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమి భారతావనిలోని విశిష్ఠ పండుగల సందర్భంగా ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీయులు తెలంగాణ వైభవం-26 ఉత్సవాలను ఆనందభరితంగా నిర్వహించారు.

ఖతర్‌లోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ ఉత్సవాలలో కుటుంబ సమేతంగా అనేక మంది ప్రవాసీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనాదిగా దసరాకు ముందుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునే తెలంగాణ సంప్రదాయాన్ని అరబ్బునాట కూడా తెలంగాణ ప్రవాసీయులు ఘనమైన సంబరంగా చేసుకోవడంతో పండుగల సందర్భంగా గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే విధంగా జరిగిన ఈ వేడుకలు సభికులను ఆహ్లాదపరిచాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

4.jpg


తెలంగాణ జానపద గాయకుడు తిరుపతి మాట్ల పాడిన గేయాలకు అనేక మంది మంత్రముగ్ధులయ్యారు. ప్రాంతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్ర చిన్నారులు కూడా వచ్చి ఇందులో భాగస్వాములు కావడంతో సాంస్కృతిక వినోదం విరాజిల్లింది. ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా భోజనాలు వడ్డించారు. ఖతర్‌లోని విభిన్న వర్గాలకు చెందిన తెలుగు ప్రవాసీ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రవాసంలో తమ మూలాలు, అస్తిత్వ పరిరక్షణ కోసం వైభవ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

1.jpg


వేడుకలలో రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రతిమా రెడ్డి, దౌత్యవేత్త డాక్టర్ దినేశ్ కుమార్ కౌల్, ప్రవాసీ సంఘాలైన ఇండియన్ కల్చరల్ సెంటర్ ఉపాధ్యక్షుడు శాంతన్ దేశ్ పాండే, సాంస్కృతిక కార్యదర్శి నందిని అబ్బగోని, ప్రవాసీ సంక్షేమ సంఘమైన ఐ.సి.బి.యఫ్ ప్రతినిధి ఖాజా నిజామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

లయోలా ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణ ఫుడ్ సన్ కాన్స్ (ప్రవీణ్ బుయ్యాని) ద్వారకా ట్రేడింగ్, డి.హెచ్.ఆర్ గ్రూప్ (హరీశ్ రెడ్డి) కార్యక్రమానికి సహాకరించాయని నిర్వాహకులు తెలిపారు.

3.jpg


ఈ వార్తలనూ చదవండి:

దాతలు ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డికి శంకరరత్న పురస్కారం

శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’

Updated Date - Oct 25 , 2026 | 04:37 PM