Share News

ఖతర్‌లో ఉత్సాహంగా మహానాడు

ABN , Publish Date - May 23 , 2026 | 04:35 PM

ఖతర్‌లో శుక్రవారం జరిగిన మహానాడుకు అల్ ఖోర్, రాస్ లాఫాన్, దుఖాన్, మెసాయిద్, అల్ వక్ర, దోహా తదితర సుదూర ప్రాంతాల నుంచి టీడీపీ యువ కార్యకర్తలు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఖతర్‌లో ఉత్సాహంగా మహానాడు
Mahanadu In Qatar

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ అభిమానులు మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఖతర్‌లో శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ అభిమానుల పసుపు పండుగకు అల్ ఖోర్, రాస్ లాఫాన్, దుఖాన్, మెసాయిద్, అల్ వక్ర, దోహా తదితర సుదూర ప్రాంతాల నుంచి యువ కార్యకర్తలు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రవాసీ ప్రముఖుడు అయిన మద్దిపోటి నరేష్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు ప్రార్థసారథి మాట్లాడుతూ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని చెప్పారు. ఖతర్ తరహాలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా స్వర్గధామంగా మార్చడానికి యువనేత నారా లోకేశ్ నిరంతర కృషి చేస్తున్నారని అన్నారు.

2.jpg


ఖతర్‌లో పని చేస్తున్న విభిన్న వర్గాలు, ప్రాంతాలకు చెందిన ప్రవాసాంధ్రులకు చేరువ కావడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యకలాపాల గురించి మద్దిపోటి నరేష్ వివరించారు. ప్రవాసాంధ్రుల సాధకబాధకలను నాయకులు విక్రం సుఖవాసి, పొనుగుమాటి రవిలు వివరించారు.

ఖతర్ నుంచి తిరుపతి, విశాఖపట్నం నగరాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్న తీర్మానాన్ని ఈ సందర్భంగా ఆమోదించారు. గల్ఫ్ దేశాలలో ఏపీ ఎన్నార్టీ సేవలను మరింత విస్తరించాలన్న తీర్మానానికీ ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఖతర్‌లో 25 సంవత్సరాలకు పైగా ఉంటూ వివిధ రంగాలలో ప్రతిభ, సేవా స్ఫూర్తిని ప్రదర్శించిన ప్రవాసాంధ్ర ప్రముఖులను మంత్రి సత్కరించి జ్ఞాపికలను అందజేసారు.

మహానాడులో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. మహానేత ఎన్టీఆర్ సినిమా సన్నివేశాలను ప్రతిబింబిస్తూ కొందరు ప్రదర్శించిన పాత్రలు కూడా సభికులను ఆకట్టుకొన్నాయి. పార్టీ నాయకులు బొడ్డు రామరావు, జె.వి.వి సత్యనారాయణ, మలిరెడ్డి సత్యనారాయణ, నూతలపాటి నరేష్, కొడాలి సుధాకర్, మల్లేశ్వరరావు తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

3.jpg1.jpg


ఈ వార్తలనూ చదవండి:

తెలుగు సమితి, తానా పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్

Updated Date - May 23 , 2026 | 04:45 PM