Share News

గల్ఫ్‌లో వైభవంగా టీడీపీ మహానాడు

ABN , Publish Date - May 23 , 2026 | 05:04 PM

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గోన్నారు.

గల్ఫ్‌లో వైభవంగా టీడీపీ మహానాడు
TDP Mahanadu

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ అభిమానులు మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఖతర్‌లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అభిమానులు మహానాడును కుటుంబసభ్యుల ఆత్మీయ కలయికగా కనులపండువగా జరుపుకున్నారు.

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేశ్‌లు అమరావతి నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలు, యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం రూపొందిస్తున్న ప్రణాళికలను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వివరించారు.

1.jpg


సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా తెలుగు సంస్కృతి, విలువలను యువతరానికి వివరించాలని శ్రీ శివబాలయోగి మహారాజ్ ట్రస్ట్ నిర్వాహకురాలు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గొట్టిపాటి సత్యవాణి సూచించారు. తెలుగు ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం, సంస్కృతి, కుటుంబ విలువలు సనాతన ధర్మంలో భాగమని సత్యవాణి అన్నారు. ఇక ఈ వేడుకల నిర్వహణకు గొట్టిపాటి రమణయ్య అన్నీ తానై వ్యవహరించగా తెలుగుదేశం ప్రముఖులు శాంతయ్య యలమంచిలి, మాదినేని అంజనేయులు సమన్వయం చేసారు.

అంతకుముందు, పార్టీ గతంలో చేపట్టిన కార్యక్రమాల సందర్భంగా రక్తదానం చేసిన ప్రవాసాంధ్ర కార్యకర్తలను అభినందిస్తూ ప్రశంసాపత్రాలను అందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మెమెంటోలు, బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. తెలుగు ప్రవాసీ కుటుంబాల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. మహిళలు నిర్వహించిన సంప్రదాయ సంగీత కార్యక్రమాలు, క్విజ్‌లు, వినోదాత్మక కార్యక్రమాలు కూడా మన్ననలు పొందాయి. ఇందుకోసం రజనీ బొందలపాటి, శ్రీ లక్ష్మి గొట్టిపాటి, వంశీ చంద్ర, పద్మ తూము, వసంతి బేతిని, చంద్రిక బాల, శిరీష మలసాని, శిరీష బండ్ల, మౌనిక గాలిని నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

3.jpg


కార్యక్రమ నిర్వహణలో కవీంద్ర గాలి, రమేష్ దాసరి, రవీంద్ర మాగులూరి, కల్యాణ చక్రవర్తి నార్నే, అంజనేయులు మోడి, అనిల్ మలసానిలతో పాటు నాయుడు, గోపాలకృష్ణ కనూరి, హనుమంతు, విజయ్ కుమార్, నాని, సతీష్, అనిల్ తదితరులు కూడా కీలక పాత్ర వహించారని నిర్వాహకులు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

తెలుగు సమితి, తానా పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్

Updated Date - May 23 , 2026 | 05:18 PM