డల్లాస్‌లో సందడిగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:06 AM
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు డల్లాస్‌లో సందడిగా జరిగాయి.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు డల్లాస్‌లో సందడిగా జరిగాయి. డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ది కాలనీలోని Twisted Bar & Grillలో నిర్వహించిన ఈ వేడుకలకు డీఎఫ్‌డబ్ల్యూ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులంతా వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్, డీజే నైట్, సంగీతం, డ్యాన్స్‌తో అభిమానులు సందడి చేశారు. పవన్ కల్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని, మరింత కాలం ప్రజాసేవలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. 300మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
TANA (తానా) ఆధ్వర్యంలో మిన్నియాపోలిస్‌లో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ