Share News

గల్ఫ్ దేశాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 15 , 2026 | 09:05 PM

గల్ఫ్ దేశాలలో జనసైనికులు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సేవాకార్యక్రమాలను నిర్వహించారు.

గల్ఫ్ దేశాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవం
Janasena Party formation day

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమికి దూరంగా ఎడారినాట గల్ఫ్ దేశాలలో జనసైనికులు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్య స్థానిక నియమాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా వివిధ గల్ఫ్ దేశాలలో జనసైనికులు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించి తమ చిత్తశుద్ధి, నిబద్ధతను చాటారని గల్ఫ్ జనసేన ఇన్‌చార్జి కేసరి త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో గల్ఫ్ జనసైనికులు ఎప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు.

యుఏఈ, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఖతర్, ఒమాన్ దేశాలలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. గల్ఫ్ దేశాలలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, ఇప్పటికే వెయ్యికి పైగా సభ్యత్వాల కోసం గూగుల్ ఫార్మ్‌లు పూర్తి అయ్యాయని తెలిపారు. త్వరలోనే గల్ఫ్ దేశాలలో భారీ స్థాయిలో ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


యూఏఈ – దుబాయ్‌లో అంబరాన్నంటిన వేడుకలు

యూఏఈలోని దుబాయ్ నగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఆటపాటల్లో జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

ఈ సందర్భంగా జాతీయ కన్వీనర్ మొగళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, దుబాయ్ నగరం జనసేన వేడుకలకు పెట్టింది పేరుగా మారిందని అన్నారు. పార్టీ కార్యక్రమాలు ఏవైనా జరిగినా వేల సంఖ్యలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు.

సౌదీ అరేబియాలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

సౌదీ అరేబియాలో జనసేన కన్వీనర్ అమీర్ ఖాన్ అన్ని తానై జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన నాయకత్వంలో రియాధ్ నగరంలో చిన్నారుల ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. భారీ సంఖ్యలో పాల్గొన్న జనసైనికుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జనసైనికులకు రుచికరమైన తెలుగు రాష్ట్రాల విందు భోజనం ఏర్పాటు చేశారు.

సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలో కూడా కన్వీనర్ చింతల మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భారీగా పాల్గొన్న జనసైనికుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ సౌదీలోని అన్ని ప్రాంతాలలో కనీవినీ ఎరుగని రీతిలో వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.


కువైత్‌లో రక్తదానంతో ప్రారంభమైన వేడుకలు

కువైత్‌లో గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రక్తదాన కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. దాదాపు 150 మంది జనసైనికులు రక్తదానం చేసి పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ, దేశం వెలుపల ఉన్నప్పటికీ జనసేన కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం కార్యకర్తల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

బహ్రెయిన్‌లో అంబరాన్నంటిన సంబరాలు

బహ్రెయిన్‌లో జనసేన నాయకులు దొడ్డపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో కూడా జనసేన ఆశయాలను విశ్వసించే పెద్ద సైన్యం ఉండటం గర్వకారణమని వ్యాఖ్యానించారు.


ఖతర్‌లో పండుగ వాతావరణంలో వేడుకలు

ఖతర్‌లో గల్ఫ్ జనసేన నాయకులు మేడిద సత్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భారీ సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా మేడిద సత్యం మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీ కోసం ఇంతమంది కలిసి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు.

ఒమాన్‌లో విజయవంతమైన వేడుకలు

ఒమాన్‌లోని మస్కట్ నగరంలో గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ చందక రామదాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామదాస్ మాట్లాడుతూ గల్ఫ్‌లో జనసేన కోసం చేసే కార్యక్రమాలు సేవా స్ఫూర్తితో కూడుకున్నవని అన్నారు. ఇదే జనసేనాని చూపించిన మార్గమని అన్నారు. అనంతరం జనసైనికులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

గల్ఫ్ దేశాలలో జనసేన పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని గల్ఫ్ సేన జనసేన నాయకులు తెలిపారు. జనసేన పార్టీ స్థాపన లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో గల్ఫ్ జనసైనికులు కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా కేసరి త్రిమూర్తులు పేర్కొన్నారు.

3.jpg5.jpg2.jpg4.jpg6.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. కువైత్‌లో రక్తదాన శిబిరం

నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యోత్సవం

Updated Date - Mar 16 , 2026 | 05:47 AM