Share News

యూకేలో తల్లీబిడ్డల దుర్మరణం! ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు జైలుశిక్ష

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:05 PM

బ్రిటన్‌ వీధుల్లో స్పోర్ట్స్ కారు రేసింగ్‌కు దిగి తల్లీబిడ్డల మరణానికి కారణమైన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు తాజాగా స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది.

యూకేలో తల్లీబిడ్డల దుర్మరణం! ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు జైలుశిక్ష
Hardeep Bachhu, Jaskamal Riyath

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌ వీధుల్లో స్పోర్ట్స్ కారు రేసింగ్‌కు దిగి తల్లీబిడ్డల మరణానికి కారణమైన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు తాజాగా స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడైన హర్‌దీప్ బచ్చూకు (29) 12 ఏళ్లు, జస్‌కమల్ రియత్‌కు (37) 16 ఏళ్ల కారాగార శిక్ష పడింది. 2023లో ఈ ఘటన జరగ్గా నిందితులకు లీడ్స్ క్రౌన్ కోర్టు సోమవారం శిక్ష విధించింది.

ఒకరికొకరు పరిచయం లేకపోయినా రేసింగ్..

ఘటనకు మునుపు నిందితులు బచ్చూ, జస్‌కమల్‌‌ మధ్య పరిచయం లేనట్టు వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజు జస్‌కమల్ బీఎమ్‌డబ్ల్యూ ఎమ్135ఐ డ్రైవ్ చేయగా బచ్చూ ఆడీ టీటీఎస్ కారును డ్రైవర్ చేశారు. కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిన వారు కారు డోర్ విండోలను దించి మాట్లాడుకున్నారు.


ఆ తరువాత రోడ్డుపై పోటాపోటీగా దూసుకెళ్లారు. వారు కార్లను ప్రమాదకరమైన రీతిలో వేగంగా తోలినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ క్రమంలో బచ్చూ డ్రైవ్ చేస్తున్న కారు ఢీకొని 27 మహిళ, ఆమె నాలుగేళ్ల కూతురు అక్కడికక్కడే కన్నుమూశారు. వారు సమీపంలోని స్కూలుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

తాను తప్పు చేసినట్టు బచ్చూ 2024లోనే అంగీకరించారు. జస్‌కమల్ మాత్రం తానే తప్పు చేయలేదని వాదించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ చూశాక స్పీడ్ లిమిట్ దాటి వెళ్లినట్టు అంగీకరించారు. ఈ క్రమంలో సోమవారం కోర్టు బచ్చూ, జస్‌కమల్‌లకు జైలు శిక్ష విధించింది. ‘రోడ్లంటే రేస్ ట్రాకులు కావు. దూసుకుపోయే కారు ఉన్నంత మాత్రాన దాని సామర్థ్యాలను పబ్లిక్ రోడ్లల్లో పరీక్షించకూడదు. ఇలా చేస్తే శాశ్వత పరిణామాలు సంభవిస్తాయి’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వెలుగులు..

డల్లాస్‌లో ఘనంగా ‘వివాహ పరిచయ వేదిక’

Updated Date - Oct 27 , 2026 | 04:20 PM