డల్లాస్‌లో డా. కె.ఎ. పాల్ గ్లోబల్ పీస్ అండ్ ప్రేయర్ మీటింగ్
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:31 PM
గ్లోబల్ పీస్ ఇనీషియేటివ్ అధ్యక్షుడు డా. కె.ఎ. పాల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న టెక్సాస్‌లోని లూయిస్‌విల్లేలో గ్లోబల్ పీస్ అండ్ ప్రేయర్ మీటింగ్ జరగనుంది.
గ్లోబల్ పీస్ ఇనీషియేటివ్ అధ్యక్షుడు డా. కె.ఎ. పాల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న టెక్సాస్‌లోని లూయిస్‌విల్లేలో గ్లోబల్ పీస్ అండ్ ప్రేయర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎన్టీఎక్స్ అరెనా ది విస్టాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాంతి, ఆశ, ప్రార్థనతో పాటు ఇమ్మిగ్రేషన్ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మద్దతు వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.
డా. కె.ఎ. పాల్ వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్లో పలువురు అంతర్జాతీయ నాయకులు, రాజకీయ ప్రముఖులు, ఆధ్యాత్మిక, సామాజిక రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 23న క్యాపిటల్ హిల్టన్‌లో జరిగిన ఈ సమావేశానికి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, మానవతా సంక్షోభాలు, శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై సమావేశంలో చర్చలు జరిగాయి.
వాషింగ్టన్ డీసీలోనే డా. కె.ఎ. పాల్ జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి శాంతి కార్యక్రమాల్లో పాల్గొంటున్న పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, మానవతా సేవల కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్న డా. పాల్, ఇప్పుడు డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో జరగనున్న ఈ ప్రార్థనా సమావేశం ద్వారా స్థానిక భారతీయులు, తెలుగు కుటుంబాలు సహా వివిధ వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:
శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో 'మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్’
సిడ్నీలో ఎన్టీఆర్ విమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్