Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:54 PM

ఏపీ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డా. పి. గురు రాజా పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్
Dr. Guru Raja

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డా. పి. గురు రాజా పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఎన్నారైలు కృషి చేయాలని సూచించారు. ఏపీని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని అన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


ఎన్నారైలు తమ స్వగ్రామాలకు తరలి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కృషి చేయాలని డా. పి. గురు రాజా అన్నారు. తమ బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. తమ ప్రచారంతో ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచి కూటమి అభ్యర్థుల విజయానికి ఎన్నారైలు కృషి చేయాలని సూచించారు.


పల్లె నుంచి కేంద్రం వరకూ అన్ని స్థాయిల్లో ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని అన్నారు. డబుల్ ఇంజన్ తరహా పాలనతో రాష్ట్ర అభివృద్ధి రెట్టింపు వేగంతో ముందుకు సాగుతుందని చెప్పారు.

Dr Guru Raja.jpg


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో తెలంగాణ సంస్కృతి వైభవం.. బతుకమ్మ పాటలు, ఆటలతో హోరెత్తిన నార్త్ కరోలినా!

పూల పరిమళాలతో పరవశించిన మలేషియా.. తెలుగు సంస్కృతికి ప్రవాసుల నీరాజనం

Updated Date - Oct 19 , 2026 | 02:12 PM