Share News

దుబాయ్‌లో ‘తెలుగు రసమయి’ ఇఫ్తార్ విందు

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:07 PM

దుబాయ్ నగరంలో తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు రసమయి ఇఫ్తార్ విందును నిర్వహించింది. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు ప్రవాసీయులలో ఆప్యాయత పెంపుదలకు దోహదం చేస్తాయని సంస్థ అధ్యక్షుడు యస్.వి.రెడ్డి పేర్కొన్నారు.

దుబాయ్‌లో ‘తెలుగు రసమయి’ ఇఫ్తార్ విందు
Dubai Iftar Telugu Rasamayi

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పవిత్ర రంజాన్ మాసం తుది అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో ఇఫ్తార్ విందులు ఊపందుకున్నాయి. సామాజిక, సాంస్కృతిక, ప్రవాసీ సంఘాలు ఇఫ్తార్ విందుల నిర్వహణలో నిమగ్నమై ఉన్నాయి.

ఈ క్రమంలో ఇటీవల దుబాయ్ నగరంలో తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు రసమయి ఇఫ్తార్ విందును నిర్వహించింది. ఇఫ్తార్, దీపావళి, దసరా, బతుకమ్మ, క్రిస్మస్ సందర్భాలలో సామూహిక విందు భోజనాలు తెలుగు ప్రవాసీయులలో ఆప్యాయత పెంపుదలకు దోహదం చేస్తాయని తెలుగు రసమయి అధ్యక్షుడు యస్.వి.రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


కులమతాలు, ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలకు అతీతంగా దుబాయ్‌లోని తెలుగు ప్రవాసీయులందరి కోసం తమ సంఘం పని చేస్తోందని ఆయన అన్నారు.

ఇఫ్తార్ విందులో తెలుగు ప్రముఖులు జాఫర్ అలీ, ఫహీం, షేఖ్ అబ్దుల్లా, సాదత్, ముజఫ్ఫర్, భాస్కర్ రెడ్డి, మున్న థామస్ తదితరులు పాల్గొన్నారని యస్.వి.రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి:

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

కెనడాలో భారత యువకుడి హత్య! మూకుమ్మడిగా దాడి చేసి..

Updated Date - Mar 17 , 2026 | 03:14 PM