Share News

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

ABN , Publish Date - Mar 17 , 2026 | 07:32 AM

సోమవారం కువైత్‌లోని సాల్మీయా ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. మైనారిటీ నాయకులు ముస్తాఖ్ ఖాన్, యువనాయకులు ఓలేటి రెడ్డయ్య చౌదరి అధ్యక్షతన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది.

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పవిత్ర రంజాన్ మాసం ముగింపు దశలో ఉన్నందున గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులలో ఇఫ్తార్ విందులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కువైత్‌లోని సాల్మీయా ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు ముస్తాఖ్ ఖాన్, యువనాయకులు ఓలేటి రెడ్డయ్య చౌదరి అధ్యక్షతన ఇఫ్తార్ విందు జరిగింది.

ఈ కార్యక్రమంలో కువైత్‌లోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసాంధ్రులు, వివిధ మతాలకు చెందిన ప్రముఖులు, సామాజిక సేవకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరభావం, మతసామరస్యం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఎంతో ఆత్మీయంగా సాగింది.

కార్యక్రమం ప్రారంభంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ ఫోన్ ద్వారా మాట్లాడుతూ తాను ఇఫ్తార్ వేడుకకు రావాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం ప్రాముఖ్యాన్ని వివరించారు. ఉపవాసం ద్వారా మనస్సును పవిత్రంగా చేసుకోవడం, సహనం, దాతృత్వం, సేవా భావం పెంపొందించుకోవడం వంటి విలువలను ఈ పవిత్ర మాసం నేర్పిస్తుందని పేర్కొన్నారు.

3.jpg


ఈ సందర్భంగా ఎన్‌ఆర్ఐ టీడీపీ మైనారిటీ నాయకులు ముస్తాఖ్ ఖాన్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ సంస్కృతి, సంప్రదాయాలు మత సామరస్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కువైత్ ఎప్పటికప్పుడు తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవ, పరస్పర సహకారం, సోదరభావాన్ని పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, సభ్యులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి సాధించి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొనడం ద్వారా మతసామరస్యానికి మంచి సందేశం వెళ్లిందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ NRI TDP కువైత్ బృందం ధన్యవాదాలు తెలిపింది. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

4.jpg


ఈ కార్యక్రమంలో కడప ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ మొహమ్మద్ హనీఫ్, ఆల్ ఇండియా యూత్ కమిటీ కన్వీనర్ షాహజాద్, ఫర్వానియా కన్వీనర్ రమేష్ కొల్లపనేని, కో కన్వీనర్ రవి మలిశెట్టి, హవల్లి కన్వీనర్ ఓలేటి రెడ్డయ్య చౌదరి, అస్మా గవర్నరేట్ నాయకులు, సీనియర్ టీడీపీ నాయకులు దివాకర్ ఓలేటి, జహ్ర నుంచి కృష్ణ చైతన్య, వెంకట బుజ్జి, ప్రముఖ ఉర్దూ కవి, మౌలానా అబ్దుల్ కలామ్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్ సహాబ్‌, మైనారిటీ నాయకులు కరీం భాయ్, చాంద్ బాషా, ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు చుండు బాల రెడ్డయ్య, గల్ఫ్ ముదిరాజ్ సంఘం కోడి ఆదినారాయణ, నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నాగేష్, సుగవాసి యువసేన అధ్యక్షులు రెడ్డి శేఖర్, పరిటాల ట్రస్ట్ అధ్యక్షులు నరసింహ, కువైత్ ఆంధ్ర న్యూస్ ఎండీ, టీడీపీ నాయకులు షేక్ బాషా, జనసేన పార్టీ నాయకులు ఉపాధ్యక్షులు గంటా రమేశ్, మహిళా నాయకురాలు సరోజ దేవి చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు వెంకట్ కోడూరి ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.

1.jpg

Updated Date - Mar 17 , 2026 | 07:53 AM