దుబాయిలో కాన్సుల్ జనరల్‌తో టీడీపీ నేత సమావేశం
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:34 PM
కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏపీ ఎన్నార్టీ రీజినల్ కోఆర్డినేటర్ సునీల్ బొయపాటి మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయి చరిత్రలో ప్రప్రథమంగా అత్యున్నత భారతీయ దౌత్యవేత్తగా భాద్యతలు స్వీకరించిన తెలుగు వ్యక్తి డాక్టర్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డితో ఎమిరేట్‌లోని తెలుగు ప్రముఖులందరు వరుసగా సమావేశమవుతున్నారు.
ఈ క్రమంలో కాన్సుల్ జనరల్‌తో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏపీ ఎన్నార్టీ రీజినల్ కోఆర్డినేటర్ సునీల్ బొయపాటి మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎమిరేట్స్‌లోని తెలుగు ప్రవాసాంధ్రుల సాధకబాధకలు, వ్యాపారతీరుతెన్నుల గురించి ఆయనకు వివరించారు. సునీల్‌తో పాటు రాధాకృష్ణా మోరంపూడి కూడా ఆయన వెంట ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
దుబాయి తెలుగు చర్చిలో స్వాతంత్ర్య దినోత్సవం
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్