దుబాయి తెలుగు చర్చిలో స్వాతంత్ర్య దినోత్సవం
ABN , Publish Date - Aug 17 , 2026 | 02:23 PM
ఆదివారం దుబాయిలోని ప్రవాసాంధ్ర క్రైస్తవులు ఒక చర్చిలో జరుపుకున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయస్ఫూర్తిని ప్రతిబింబించాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: స్వేచ్ఛ, సాంస్కృతిక వైవిధ్యంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ భారతీయులందరూ కుల, మత, ప్రాంతీయ బేధాలకు అతీతంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిజమైన జాతీయ పండుగగా జరుపుకుంటారని దుబాయిలోని ప్రవాసాంధ్రులు నిరూపిస్తున్నారు.
ఆదివారం దుబాయిలోని ప్రవాసాంధ్ర క్రైస్తవులు ఒక చర్చిలో జరుపుకున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయస్ఫూర్తిని ప్రతిబింబించాయి. యెహోవా షాలోం తెలుగు చర్చిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళలందరూ జాతీయ త్రివర్ణ పతాక రంగులు కలగలిసిన మువ్వన్నెల చీరలు ధరించి బైబిల్ పఠనంతో సమగ్ర స్వర్ణాంధ్ర ప్రగతి కోసం ప్రార్ధించడం ద్వారా తమ దేశభక్తిని చాటుకున్నారు.

స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వివిధ దేశభక్తి గేయాలను ఆలపించారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసీయులు ఎక్కువగా వచ్చే తమ చర్చిలో గత పన్నెండేళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లుగా చర్చి నిర్వహుకులు సంపద రావు ఆడిదల వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్
అమెరికా రాజధానిలో.. GWTCS ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర వేడుకలు