Share News

డల్లాస్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:45 PM

డల్లాస్ పరిసర ప్రాంతం అర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ అనే నినాదంతో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

డల్లాస్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం
Indian Independence Day celebrations-Dallas Irving

డల్లాస్ పరిసర ప్రాంతం అర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ అనే నినాదంతో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. MGMNT వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వల సభికులకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతోపన్యాసం చేశారు. సమీరా శ్రీపాద శిష్యులు అమెరికా జాతీయగీతంతో పాటు భారతదేశభక్తి గీతాలను ఆలపించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి అన్నారు. ప్రవాస భారతీయలు అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యఅతిథిగా అర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ..రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్‌ల మధ్య ధృఢమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని కొనియాడారు.

NRI.jpg


ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై పద్యాన్ని గానం చేశారు. వామరాజు సత్యమూర్తి, భారతదేశ సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రా, చెస్ ఛాంపియన్ సరయు తలపనేని, స్మారకస్థలి కో-ఛైర్మన్ తాయబ్ కుండావాలా, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపు, ఎం.వి.ఎల్ ప్రసాద్, ఏపీ మాజీ డీజీపీ డా. కె. అరవిందరావు తదితరులు పాల్గొన్నారు.

NRI3.jpgNRI2.jpg


ఈ వార్తలనూ చదవండి:

దుబాయిలో కాన్సుల్ జనరల్‌తో టీడీపీ నేత సమావేశం

దుబాయి తెలుగు చర్చిలో స్వాతంత్ర్య దినోత్సవం

Updated Date - Aug 19 , 2026 | 06:50 PM