మెల్‌బోర్న్‌లో 'నిజం గెలిచింది' కార్యక్రమం
ABN , Publish Date - Sep 10 , 2026 | 08:00 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమం అరెస్టు ఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో APNRT ప్రతినిధులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమం అరెస్టు ఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో APNRT ప్రతినిధులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. 2023 సెప్టెంబర్ 9న ఆయనను చట్టవిరుద్ధంగా నిర్బంధించిన చీకటి రోజును గుర్తుచేసుకుంటూ, ఏపీఎన్ఆర్టీ (APNRT) ప్రభుత్వ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
యువనేత నారా లోకేష్ పిలుపు మేరకు, ‘నిజం గెలవాలి’ అనే నినాదంతో మెల్‌బోర్న్‌లో 53 సంఖ్య ఆకారంలో అమర్చిన కొవ్వొత్తులను వెలిగించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సంఘీభావం తెలిపారు. అప్పట్లో ఆయనపై పెట్టిన కేసులు పూర్తిగా అసత్యమైనవని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఈ సందర్భంగా ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రజల కోసం నిబద్ధతతో, నిజాయితీగా పని చేసే నాయకుడిని అప్రజాస్వామికంగా అణచివేయాలని చూసినా, అంతిమంగా న్యాయమే గెలిచిందని వారు అన్నారు. కష్టాలను ఎదుర్కొంటూ నిప్పులాంటి రాజకీయం చేసిన చంద్రబాబు, ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ప్రజల విజయం అని ప్రవాసాంధ్రులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో APNRT సమన్వయకర్తలు లగడపాటి సుబ్బారావు, కిషోర్ బలుసు, రామ్ ముప్పనేని, అరవింద్, నరేంద్ర బాబు కుక్కపల్లి, శ్రీ చరణ్, భరత్ రావులపల్లి, దర్నేష్ యడ్లపల్లి సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీనిక్స్‌లో స్వరాల పండుగ… కట్టిపడేసిన ఇళయరాజా కార్యక్రమం!
గల్ఫ్‌లో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు