Share News

తెలుగు బాలిక సత్తా... యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం

ABN , Publish Date - Jul 17 , 2026 | 10:22 PM

అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాకు చెందిన తెలుగు బాలిక కృష్ణవి కాసు ప్రతిష్ఠాత్మక 2026 యోనెక్స్ యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది.

తెలుగు బాలిక సత్తా... యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం
Krishnavi Kasu

అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాకు చెందిన తెలుగు బాలిక కృష్ణవి కాసు ప్రతిష్ఠాత్మక 2026 యోనెక్స్ యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది. కాన్సాస్ రాష్ట్రంలోని విచిటా నగరంలో జూలై 8 నుంచి 14 వరకు జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో అండర్-13 బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని అమెరికా జాతీయ ఛాంపియన్‌గా అవతరించింది.

బాలికల అండర్-13 డబుల్స్ విభాగంలో కూడా కృష్ణవి కాసు రజత పతకాన్ని సాధించగా అండర్-13 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి ఒకే టోర్నమెంట్‌లో మూడు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. చిన్న వయస్సులోనే ఈ స్థాయి విజయాలు సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమని క్రీడా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

అట్లాంటాలోని ప్రముఖ ఫోర్టియస్ (FORTIUS) బ్యాడ్మింటన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణవి, క్రమశిక్షణతో కూడిన సాధన, పట్టుదల, అంకితభావంతో ఈ అరుదైన విజయాన్ని అందుకుంది. ఫోర్టియస్ క్లబ్‌లోని కోచ్‌లు, శిక్షణా బృందం, సహచర క్రీడాకారులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది.

2.jpg


కృష్ణవి తల్లిదండ్రులు రవీ కాసు, సంధ్యా పంటా మాట్లాడుతూ, ఈ విజయం తమ కుటుంబానికే కాకుండా ఫోర్టియస్ క్లబ్‌కు, అట్లాంటా తెలుగు సమాజానికి గర్వకారణమని అన్నారు. కృష్ణవి ప్రతిభను గుర్తించి ఆమె లక్ష్య సాధనకు అండగా నిలిచిన క్లబ్ యాజమాన్యం, కోచ్‌లు, శిక్షణా బృందం, సహచర క్రీడాకారులు, తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఫోర్టియస్ కోచింగ్ బృందం మాట్లాడుతూ, జూనియర్ నేషనల్స్‌లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు కష్టపడి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ప్రశంసించింది. క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రుల మధ్య ఉన్న విశ్వాసం, సమష్టి కృషే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కృష్ణవి ఘన విజయంపై అట్లాంటా తెలుగు సంఘాలు, భారతీయ సమాజం, ఫోర్టియస్ బ్యాడ్మింటన్ క్లబ్, బంధువులు, స్నేహితులు, కోచ్‌లు, సహచర క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి తెలుగు ప్రజలకు మరింత గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

3.jpg


కృష్ణవి కాసు సాధించిన విజయాలు

అండర్-13 బాలికల సింగిల్స్ – స్వర్ణ పతకం

అండర్-13 బాలికల డబుల్స్ – రజత పతకం

అండర్-13 మిక్స్‌డ్ డబుల్స్ – నాలుగో స్థానం

4.jpg

ఈ వార్తలనూ చదవండి:

సెయింట్‌ లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగం

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో దశసహస్ర మోదక హోమం

Updated Date - Jul 17 , 2026 | 10:26 PM