Used Tea Powder Benefits: వాడేసిన టీ పొడితో ఇలా...
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:04 AM
రోజూ టీ తయారుచేసుకున్న తరువాత వడకట్టి టీ పొడిని పడేయకుండా ఇలా చేస్తే సరి...
రోజూ టీ తయారుచేసుకున్న తరువాత వడకట్టి టీ పొడిని పడేయకుండా ఇలా చేస్తే సరి...
ఈ టీ పొడిలో కొన్ని నీళ్లు పోసి వడకట్టేస్తే అందులో పాలు, చక్కెరల అవశేషాలు తొలగిపోతాయి. తరువాత దీన్ని పూల మొక్కల కుండీల్లో వేస్తే మంచి ఎరువుగా పనిచేస్తుంది.
వాడేసిన టీ పొడిలో కొద్దిగా వెనిగర్‌ను కలిపి పేస్టులా చేయాలి. దీనితో వంటపాత్రలను తోమితే వాటికి పట్టిన మసాల వాసనలు, జిడ్డు పూర్తిగా తొలగిపోతాయి.
చిన్న ప్లాస్టిక్ గిన్నెలో వాడేసిన టీ పొడిని వేసి ఫ్రిజ్‌లో ఒక మూల పెట్టాలి. ఇది ఫ్రిజ్‌లో దుర్వాసనను తొలగిస్తుంది.
వాడేసిన టీ పొడిని ఆరబెట్టి అందులో కొద్దిగా తేనె, పెరుగు వేసి ప్యాక్‌లా చేసి ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత మంచినీళ్లతో కడిగేసుకుంటే చర్మరంధ్రాలు పూర్తిగా శుభ్రపడతాయి. మొటిమలు రావు. ఒక టబ్‌లో వేడినీళ్లు తీసుకుని అందులో ఈ టీ పొడిని వేసి 5 నిమిషాల తరువాత పాదాలు ముంచితే పగుళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వాడేసిన టీ పొడిని మంచి నీళ్లతో శుభ్రం చేసిన తరువాత అందులో మరికొన్ని నీళ్లు పోసి బాగా మరిగించి గిన్నెలోకి వడబోయాలి. ఈ నీటిని తలకు కండిషనర్‌లా అప్లయ్ చేస్తే శిరోజాలు నల్లగా మెరుస్తాయి.
ఇవి కూడా చదవండి..
వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిని 30 సెకెన్లలో కనిపెట్టండి..