ఉగాది వేళ... లంగా ఓణీల హేల
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:48 AM
తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ పండుగ రోజున సంప్రదాయబద్దంగా పదహారణాల తెలుగమ్మాయిలా మెరిసిపోవాలంటే లంగా ఓణీ వేసుకోవాల్సిందే అంటున్నారు ప్రముఖ డిజైనర్..
తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ పండుగ రోజున సంప్రదాయబద్దంగా పదహారణాల తెలుగమ్మాయిలా మెరిసిపోవాలంటే లంగా ఓణీ వేసుకోవాల్సిందే అంటున్నారు ప్రముఖ డిజైనర్ భార్గవి కూనం! మోడ్రన్ హంగులు జోడించి రకరకాల ఫ్యాబ్రిక్‌లతో ఆమె రూపొందించిన స్టయిలిష్ లంగా ఓణీలు ఇవే...
ఇది లోటస్ మోటి్‌ఫలతో కూడిన కంచి పట్టు లంగా. దీనిమీద అదే మోనోక్రమ్ కలర్ ప్యాలెట్‌లో ఎర్రటి టిష్యూ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఓణీని రూపొందించారు. దీనికి బెనారసీ వీవింగ్ ద్వారా అందమైన వర్క్ బోర్డర్‌ను ఆపైన మరో ట్రెడిషనల్ బోర్డర్‌ను జోడించారు. ఈ లంగా ఓణీ మరింత గ్రేస్‌గా కనిపించేందుకు చిన్న చిన్న బుటీలు ఉన్న ఆకుపచ్చని బ్లౌజ్‌ను జత చేశారు.
ఇది లావెండర్ బోర్డర్ ఉన్న పింక్ కలర్ పట్టు లంగా. దీనికి పింక్ కలర్ షిఫాన్ ఓణీని జతచేశారు. దీనిమీద చిన్న చిన్న పూల మోటి్‌ఫలను ఎంబ్రాయిడరీ చేసి కంచి పట్టు బోర్డర్‌ను జతచేశారు. ఈ లంగా ఓణీ వేసుకుంటే సన్నగా నాజూగ్గా అందంగా కనిపిస్తారు.
ఇది కాంజీవరం ఎల్లో లంగా. ఓణీని వైట్ అండ్ సిల్వర్ బెనారస్ టిష్యూ ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. దీనిమీద గోల్డ్ క్రాస్ లైన్స్‌ను వీవింగ్ ద్వారా కూర్చారు. దీనికి ఎర్రటి పట్టు బోర్డర్‌ను జతచేశారు. ఎలిగెంట్ లుక్‌తో అందంగా మెరుస్తూ ఉంటుంది ఈ లంగా ఓణీ.
ఇది ఆరెంజ్ కలర్ కంచి పట్టు లంగా. దీనిమీద వర్టికల్ లైన్స్‌లో ఖైరీ మ్యాంగో మోటి్‌ఫలను కాంజీవరం వీవింగ్ ద్వారా కూర్చారు. ఓణీని పింక్ కలర్ టిష్యూ కాంజీవరం ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. దీనికి ఆరెంజ్ కలర్ కుట్టు బోర్డర్‌ను ఆకుపచ్చని అంచుతో జతచేశారు. ఈ లంగా ఓణీ బ్రైట్‌నె్‌సను బ్యాలెన్స్ చేయడానికి హాఫ్ వైట్ పట్టు బ్లౌజ్‌ను ఎంపిక చేశారు.
ఇది తెల్లటి కాంజీవరం లంగా. దీనికి వైట్ అండ్ గోల్డ్ కాంజీవరం పట్టు బోర్డర్‌ను జోడించారు. ఓణీని సీ గ్రీన్ కలర్ కంచి టిష్యూ ఫ్యాబ్రిక్‌తో రూపొందించి ఎంబ్రాయిడరీ బోర్డర్‌ను జోడించారు.
ఫ ఇది మెరూన్ కలర్ కంచి పట్టు లంగా. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్‌లో నేసిన కోటా ఫ్యాబ్రిక్ ఓణీమీద బ్లాక్ ప్రింట్‌తో మోటి్‌ఫలను, బోర్డర్ డిజైన్‌ను సృష్టించారు. ఈ లంగా ఓణీ విభిన్నంగా చూడడానికి అహ్లాదకరంగా ఉంటుంది.
సాధారణంగా తొమ్మిదేళ్ల లోపు వయసున్న ఆడపిల్లలకు పట్టులంగా జాకెట్ వేసి కాళ్లకు వెండి పట్టీలు పెట్టి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. అమ్మాయికి పదకొండేళ్లు వచ్చిన తరువాత అమ్మమ్మ- తాతయ్య లేదా మేనమామ... ఓణీల వేడుక నిర్వహించి అందమైన ఓణీని బహూకరిస్తారు. అప్పటి నుంచి వివాహమయ్యేంతవరకు అమ్మాయిలు రకరకాల లంగా ఓణీలు వేసుకునేవారు. కాటన్, సిల్క్ ఓణీలను రోజువారీ ధరించేవారు. పండుగలు, శుభకార్యాల్లో మాత్రం పట్టు పరికిణీల మీద షిఫాన్, జార్జెట్ ఓణీలతో సందడి చేసేవారు. అమ్మాయి ఓణీ వేసుకుంటే పెళ్లికి సిద్దంగా ఉన్నట్లేనని సమాజంలో భావించేవారు. కాలక్రమేణా రకరకాల ఫ్యాషన్ డ్రెస్‌లు ఉప్పెనలా వచ్చేశాయి. పంజాబీ డ్రెస్‌లు, సల్వార్ సూట్లు లాంటివి అమ్మాయిలకు సౌకర్యవంతంగా ఉండడంతో లంగా ఓణీలు ఽవేసుకునేవారి సంఖ్య బాగా తగ్గింది. అయినప్పటికీ ప్రత్యేక సందర్భాల్లో లంగాఓణీలు వేసుకుంటూ తమ ఇష్టాన్ని చాటుకుంటున్నారు అమ్మాయిలు. దీంతో మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తగ్గట్టు రకరకాల ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన లంగా ఓణీలు అందుబాటులోకి వచ్చేశాయి. కంచి, కాంజీవరం, ధర్మవరం, నారాయణపేట, ఉప్పాడ, పైథానీ, బెనారస్ పట్టు లంగా ఓణీలు కూడా బడ్జెట్‌లోనే లభ్యమవుతున్నాయి. కోటా జరీ, సూపర్‌నెట్, రాసిల్క్ ఫ్యాబ్రిక్‌లతో రూపొందించినవి లైట్ వెయిట్‌తో హాయిగా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. హెవీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌లు ఉన్నవాటిరి అత్యధికంగా డిమాండ్ ఉంటోంది. లంగా ఓణీలు ఒకే ఫ్యాబ్రిక్‌తో ఉండాలని కాకుండా ఓణీలను సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన