డాంగిల్ ఇయర్ రింగ్స్
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:53 AM
పొడవాటి గొలుసులతో వేగంగా ఊగుతూ విభిన్నమైన డిజైన్లలో మెరిసే డాంగిల్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. చెవి తమ్మె నుంచి భుజాల వరకు వేలాడే షోల్డర్ డస్టర్ ఇయర్ రింగ్స్, మల్టీ లేయర్ బాల్ చెయిన్ డిజైన్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
పొడవాటి గొలుసులతో వేగంగా ఊగుతూ విభిన్నమైన డిజైన్లలో మెరిసే డాంగిల్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. చెవి తమ్మె నుంచి భుజాల వరకు వేలాడే షోల్డర్ డస్టర్ ఇయర్ రింగ్స్, మల్టీ లేయర్ బాల్ చెయిన్ డిజైన్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టాసెల్స్, పూసలు, గుండ్లు, జ్యామితి డయాగ్రమ్స్, ప్రకృతి సంబంధిత ఆకృతులు వీటి ప్రత్యేకత.
నేటి ఫ్యాషన్లకు అనుగుణంగా రకరకాల మోడల్స్‌లో డాంగిల్ ఇయరింగ్స్ లభ్యమవుతున్నాయి. ఆఫ్ షోల్డర్, వి నెక్, డీప్ స్కూప్ నెక్‌లైన్లు, ఈవెనింగ్ కాక్‌టెయిల్ గౌన్లు, చీరలు, లెహంగాల మీద ఇవి చక్కగా సూటవుతాయి. షాండిలియర్ డిజైన్లు, థ్రెడర్లు, రత్నాల డ్రాప్‌లు, లీనియర్ చైన్ టాసెల్స్... రోజువారీ ధరించడానికి బాగుంటాయి. వీటిని సులువుగా పెట్టుకోవడానికి వీలుగా ఫిష్ హుక్ వైర్లు, లివర్ బ్యాక్‌లు, సెక్యూర్ పోస్ట్ బ్యాక్‌లను జతచేస్తారు.
పూలతో...
బంగారు గుండ్లు, గుండ్రని ముత్యాలు, మెరిసే క్రిస్టల్స్ జతచేసిన సన్నని గొలుసులకి పూలు, వాటి రేకులు, ఆకుల ఆకృతులను జోడిస్తారు. ఇవి వెస్ట్రన్, ట్రెడిషనల్ డ్రెస్‌ల మీద ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సింపుల్, సోబర్, డబుల్ లింక్ చెయిన్ డిజైన్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది.
లేయర్ చెయిన్స్‌తో...
హంస, నెమలి, తామర పువ్వు, మెరిసే రాయి లాంటి దిద్దులకు సన్నని లేయర్ చెయిన్స్ జతచేస్తారు. వీటికి మధ్య మధ్యలో గుత్త పూసలు, మువ్వలు, గుండ్లు, బీడ్స్ అమరుస్తారు. పండుగలు, శుభకార్యాలప్పుడు ధరించే సంప్రదాయ దుస్తులపై ఇవి గ్రాండ్ లుక్‌నిస్తాయి.
బర్డ్ స్టయిల్‌తో...
ఎగురుతున్న పక్షుల ఆకారాలను సన్నని గొలుసుతో జతచేసి ఫ్రెంచ్ హుక్‌ను అమరుస్తారు. ఇలాంటి డిజైన్స్.. మోడరన్ డ్రెస్‌లపై ప్రత్యేకంగా కనిపిస్తాయి.
జామెట్రిక్ డిజైన్లతో...
త్రిభుజాలు, దీర్ఘచతురస్రాలు, చతురస్రాలు, వృత్తాలు, అర్థచంద్రాకారాలు, స్పష్టమైన కోణాలతో డిజైన్ చేసిన డాంగిల్ ఇయరింగ్స్.. అన్ని రకాల మోడరన్ డ్రెస్‌లపై ఫ్యాషనబుల్‌గా సూటవుతాయి. ఫార్మల్ వేర్, ఆఫీస్ వేర్ మీద కూడా చక్కగా నప్పుతాయి. వీటిని బంగారం, స్టెర్లింగ్ వెండి, బ్లాక్ మెటల్, ఇత్తడి లాంటి లోహాలతో రూపొందిస్తారు. పావే వజ్రాలు, క్యూబిక్ జిర్కోనియా, ముత్యాలు, రంగు రంగుల ఎనామెల్ పెయింటింగ్‌లతో అదనపు హంగులద్దిన డిజైన్లు కూడా విరివిగానే లభ్యమవుతున్నాయి. ఇవి సంప్రదాయ దుస్తులపై అందంగా కనిపిస్తాయి.