Share News

వెండి గాజులదే ట్రెండ్‌..!

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:39 AM

వెండి గాజులు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. రకరకాల డిజైన్లు అందుబాటులోకి రావడంతోపాటు బడ్జెట్‌లోనే లభిస్తుండడంతో టీనేజ్‌ అమ్మాయిల నుంచి మధ్య వయసు...

వెండి గాజులదే ట్రెండ్‌..!

వెండి గాజులు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. రకరకాల డిజైన్లు అందుబాటులోకి రావడంతోపాటు బడ్జెట్‌లోనే లభిస్తుండడంతో టీనేజ్‌ అమ్మాయిల నుంచి మధ్య వయసు మహిళల వరకు అందరూ వెండి గాజులపైనే దృష్టి సారిస్తున్నారు. సందర్భానికి తగ్గట్టు రకరకాల డిజైన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సిల్వర్‌ బ్యాంగిల్స్‌ ఇవే...

హాలో డిజైన్‌

ఇవి అంత గ్రాండ్‌గా కాకుండా ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంటాయి. రోజువారీ వేసుకోవడానికి బాగుంటాయి. తేలికగా ఉంటూ అన్ని రకాల డ్రెస్‌లమీద చక్కగా నప్పుతాయి.

ప్లెయిన్‌ బ్యాంగిల్స్‌

ఇవి మోడరన్‌ దుస్తుల మీద మంచి ఎంపిక. జీన్స్‌, స్కర్ట్‌లపై వేసుకుంటే రెట్రో లుక్‌ వస్తుంది. కాలేజీలకెళ్లే అమ్మాయిలకు, ఉద్యోగినులకు సౌకర్యవంతంగా ఉంటాయి.

మినిమలిస్టిక్‌ డిజైన్‌

ఇవి చక్కగా మెరుస్తుంటాయి. దృఢంగా ఉండడం వల్ల వంకరపోతాయనే భావన రాదు. వెండి కడియంతో కలిపి వేసుకుంటే గ్రాండ్‌ లుక్‌ వస్తుంది. సంప్రదాయ దుస్తులమీద అందంగా నప్పుతాయి.

ట్విస్టెడ్‌ డిజైన్‌

సింపుల్‌గా కనిపించాలనుకునేవారికి ఈ డిజైన్‌ చక్కగా ఉంటుంది. రోజువారీ వేసుకోవచ్చు. రంగురంగుల గాజుల మధ్యలో చేర్చి వేసుకుంటే కొత్త లుక్‌ వచ్చేస్తుంది.


స్టయిలింగ్‌ ఇలా...

  • బేబీ పింక్‌, లావెండర్‌, గ్రే, స్కై బ్లూ కలర్‌ డ్రెస్‌లపై వెండి గాజులు వేసుకుంటే గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తారు.

  • డ్రెస్‌తో మ్యాచ్‌ అయ్యే కలర్‌ బ్యాంగిల్స్‌తో రెండు లేదా నాలుగు వెండి గాజులను కలిపి వేసుకుంటే గ్రాండ్‌ లుక్‌ వస్తుంది.

  • జీన్స్‌, కుర్తీలు, కాటన్‌ డ్రెస్‌లపైన రకరకాల డిజైన్లు ప్రయత్నిస్తే ట్రెండీ లుక్‌ వస్తుంది.

  • టీషర్ట్స్‌, మిడీ స్కర్ట్స్‌, ఇతర ఫ్యాషన్‌ డ్రెస్‌లపైన ‘కడా’ డిజైన్లు నప్పుతాయి.

స్టోన్‌ డిజైన్‌

ఇవి గ్రాండ్‌ లుక్‌తో ఉంటాయి. పండుగలు, వివాహాది శుభకార్యాలప్పుడు వేసుకుంటే బాగుంటుంది. పట్టుచీరలు, లెహంగాల పైన రిచ్‌గా కనిపిస్తాయి.

ఫ్లోరల్‌ డిజైన్‌

అందమైన పూల డిజైన్‌ వీటికి ప్రధాన ఆకర్షణ. చేతికి సింగిల్‌ బ్యాంగిల్‌ వేసుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. ముత్యాల గోట్స్‌, రాళ్ల గాజులు, రంగురంగుల గాజులతో చేర్చి సెట్‌గా వేసుకుంటే గ్రాండ్‌ లుక్‌ వస్తుంది. అన్ని రకాల దుస్తులపైన ఏ సందర్భంలోనైనా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.

సర్కిల్‌ స్టోన్‌ డిజైన్‌

హాలో డిజైన్స్‌ మధ్యలో రంగురంగుల రాళ్లను కూర్చి వీటిని రూపొందిస్తారు. ఇవి అందమైన బ్రేస్‌లెట్‌ను పోలి ఉంటాయి. మోడరన్‌ డ్రెస్‌లపైన సింగిల్‌ బ్యాంగిల్‌ వేసుకుంటే ట్రెండీగా కనిపిస్తారు.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 29 , 2026 | 01:39 AM