Share News

శారీ విత్‌ దుపట్టా

ABN , Publish Date - May 20 , 2026 | 05:17 AM

చీరను దుపట్టాతో జత చేస్తే? చీర వేరు, దుపట్టా వేరు, అలాంటప్పుడు ఈ రెండిటికీ జోడీ ఎలా కుదురుతుందని అనుకుంటున్నారా? పెద్ది సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కోసం,...

శారీ విత్‌ దుపట్టా

ఫ్యాషన్‌

చీరను దుపట్టాతో జత చేస్తే? చీర వేరు, దుపట్టా వేరు, అలాంటప్పుడు ఈ రెండిటికీ జోడీ ఎలా కుదురుతుందని అనుకుంటున్నారా? పెద్ది సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కోసం, జాన్వీ కుమార్‌ ఇలాగే ముస్తాబైంది. తాజా ట్రెండ్‌గా మారిన ఇలాంటి శారీ విత్‌ దుపట్టా స్టైల్‌ మీరూ ట్రై చేయండి.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా, జాన్వీ కోసం ఒక వినూత్నమైన స్టైల్‌ను రూపొందించారు. చీరకట్టుకు, చున్నీని జత చేసి, ఆసక్తికరమైన ఫ్యాషన్‌ ట్రెండ్‌ను సృష్టించారు. ఈ వేడుక కోసం హాజరైన జాన్వీ, లేత నీలం రంగు షిఫాన్‌ చీరకు, మ్యాచ్‌ అయ్యేలా అదే రంగు దుపట్టాను మెడలో వేలాడదీసి, మోనోటోన్‌ లుక్‌తో అదరగొట్టేసింది. శారీ విత్‌ దుపట్టా స్టైల్‌ను ఎవరైనా అనుసరించవచ్చు. అందుకోసం కొంత నేర్పు, ఓర్పు అవసరం.

దుపట్టా ఆడంబరంగా...

ఎంబ్రాయిడరీ, ప్రింటెడ్‌, వూవెన్‌... వీటిలో ఎలాంటి దుపట్టా అయినా ఎంచుకోవచ్చు. అయితే దుపట్టా, చీర రెండూ కాంట్రాస్ట్‌ రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. రెండింట్లో ఒకటి భారీగా, రెండోది తేలికగా ఉండాలి. చీర మీద వర్క్‌ భారీగా ఉంటే, దుపట్టా ప్లెయిన్‌గా ఉండేలా చూసుకోవాలి. చీర ప్లెయున్‌గా ఉంటే, దుపట్టా భారీగా ఉండాలి.

వేడుకల్లో...

ప్రత్యేకించి వేడుకల కోసం శారీ విత్‌ దుపట్టా స్టైల్‌ను ఎంచుకోవచ్చు. బందేజ్‌, పటోలా, బెనారస్‌, కాంజీవరం చీరను ఎంచుకుంటే, షిఫాన్‌ దుపట్టాతో అదనపు హంగును జోడించుకోవచ్చు. ఆర్గంజా దుపట్టాలు కూడా హూందాగా ఉంటాయి. దుపట్టాను మడిచి, కుడి భుజం పైనుంచి ముందుకు వేలాడదీస్తే, చీరకు ప్రత్యేక ఆకర్షణ తోడవుతుంది.

ఇవి కూడా చదవండి..

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Updated Date - May 20 , 2026 | 05:17 AM