రెయిన్ పాంచోస్
ABN , Publish Date - Jun 24 , 2026 | 06:16 AM
వానల్లో తడవకుండా స్టయిలిష్‌గా కనిపించాలనుకునేవాళ్ల కోసం రెయిన్ పాంచోస్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. నిన్నా మొన్నటి వరకు ఎండల్లో సౌకర్యవంతంగా ఉండేందుకు వేసుకున్న...
ఫ్యాషన్
వానల్లో తడవకుండా స్టయిలిష్‌గా కనిపించాలనుకునేవాళ్ల కోసం రెయిన్ పాంచోస్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. నిన్నా మొన్నటి వరకు ఎండల్లో సౌకర్యవంతంగా ఉండేందుకు వేసుకున్న కాటన్ పాంచోస్ సరికొత్త హంగులద్దుకుని వాటర్‌ప్రూఫ్ ముస్తాబుతో ఫ్యాషనబుల్ లుక్‌తో అందుబాటులోకి వచ్చేశాయి. పోల్కా డాట్స్, ఫ్లోరల్ ప్రింట్స్, యానిమల్ డిజైన్స్, త్రీడీ ప్రింట్స్, చెక్స్ డిజైన్లతో రూపొందించిన రంగురంగుల పాంచోస్ మహిళలను అలరిస్తున్నాయి.
రెయిన్ పాంచో్‌సని సాధారణంగా నైలాన్, పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌లతో రూపొందిస్తారు. వర్షపు నీరు లోపలి భాగాల్లోకి వెళ్లకుండా వీటిని వాటర్‌ఫ్రూఫ్, పాలియురేథేన్ లేయర్స్‌తో డిజైన్ చేస్తారు. వర్షపు జల్లు నేరుగా ముఖంపై పడకుండా హుడీ కాపాడుతుంది. సరసమైన ధరలకు లభించే డిస్పోజబుల్ మోడల్ నుంచి హెవీ డ్యూటీ హైకింగ్ మోడల్స్ వరకు రకరకాల డిజైన్లు... ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో లభిస్తున్నాయి.
రెయిన్ పాంచో.. భుజాల నుంచి మోకాళ్ల వరకు వదులుగా ఉండే గౌన్ మాదిరి కనిపిస్తుంది. హ్యాండ్ బ్యాగ్‌లు, బ్యాక్ పాక్‌లాంటి వాటిని తడవకుండా కాపాడుతుంది. దీనికి ప్రత్యేకంగా అమర్చిన హుడీ.. స్టయిలిష్ లుక్‌నిస్తుంది. ఈ పాంచో పై నుంచి కింది వరకు వదులుగా ఉండడం వల్ల వానకి తడిసినప్పటికీ కొద్దిగా గాలి వీస్తే చాలు వెంటనే ఆరిపోతుంది. తేలికగా ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. సులువుగా ధరించవచ్చు. అంతేకాదు చక్కగా మడతపెడితే హ్యాండ్ బ్యాగ్‌లో సులభంగా ఇముడుతుంది. వర్షాకాలమంతా రంగురంగుల పాంచో్‌సను వెంట తీసుకెళ్లవచ్చు.
రెయిన్ పాంచో్‌సను తేలికపాటి సబ్బు లేదా షాంపూతో శుభ్రం చేసి మంచినీటిలో ముంచి నీడలో ఆరేయాలి. ఎండలో ఆరబెట్టకూడదు. ఇవి పొడిగా ఆరిన తరువాత వదులుగా మడతపెట్టి మధ్యలో సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచి భద్రపరచుకోవాలి. లేదంటే హ్యాంగర్లకు వేలాడదీయడం ఉత్తమం. తేమ నిలిస్తే పాంచో్‌సలో బూజు ఏర్పడడం, దుర్వాసన రావడం లాంటివి ఎదురవుతాయి. కొన్ని రకాల పాంచో్‌సను ఎంత ఆరబెట్టినా తేమగా ఉన్నట్లే ఉంటాయి. అలాంటి వాటి మధ్యలో కొద్దిగా టాల్కం పౌడర్ చల్లి భద్రపరచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి