Share News

మురిపించే ముత్యాల బ్రేస్‌లెట్లు

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:00 AM

ముత్యాలంటే అమితంగా ఇష్టపడే అమ్మాయిల కోసం కొత్త తరహా బ్రేస్‌లెట్లు మార్కెట్లోకి వచ్చేశాయి. గుండ్రటి ముత్యాలను చేర్చి విభిన్నంగా డిజైన్‌ చేసిన ఈ బ్రేస్‌లెట్లను...

మురిపించే  ముత్యాల బ్రేస్‌లెట్లు

ముత్యాలంటే అమితంగా ఇష్టపడే అమ్మాయిల కోసం కొత్త తరహా బ్రేస్‌లెట్లు మార్కెట్లోకి వచ్చేశాయి. గుండ్రటి ముత్యాలను చేర్చి విభిన్నంగా డిజైన్‌ చేసిన ఈ బ్రేస్‌లెట్లను మహిళలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ముత్యాల బ్రేస్‌లెట్లపై ఓ లుక్కేద్దామా...

క్లాసిక్‌ పెర్ల్‌ మోడల్‌

చిన్న, పెద్ద సైజుల్లో ఉండే గుండ్రటి ముత్యాలను వరుసలుగా పేర్చి చక్కని డిజైన్‌తో ఈ క్లాసిక్‌ మోడల్‌ను రూపొందిస్తారు. ఇది ఆఫీస్‌వేర్‌, క్యాజువల్‌ వేర్‌లమీద చక్కగా నప్పుతుంది. అన్ని సందర్భాల్లో హుందాగా రాయల్‌గా కనిపిస్తుంది.

గోల్డ్‌ చైన్‌ మోడల్‌

సన్నని బంగారు గొలుసుకు మధ్య మధ్యలో ముత్యాలను జోడించి ఆ తరువాత రెండు లేదా మూడు లేయర్లుగా డిజైన్‌ చేస్తారు. బంగారం, ముత్యాల కాంబినేషన్‌లో రూపొందించిన ఈ బ్రేస్‌లెట్‌ ట్రెండీగా కనిపిస్తూ పండుగలు, వివాహాది శుభకార్యాల్లో ధరించడానికి బాగుంటుంది.

మల్టీ లేయర్‌ మోడల్‌

తెల్లటి ముత్యాలను దండలా కూర్చి ఆపైన పలు లేయర్లుగా ఓ పెండెంట్‌కు జోడిస్తారు. పార్టీల్లో, ప్రత్యేకమైన ఈవెంట్లలో ధరించడానికి ఈ మోడల్‌ను బెస్ట్‌ చాయిస్‌గా చెప్పవచ్చు. అన్ని రకాల డ్రెస్‌లపైన ఇది గ్రాండ్‌గా కనిపిస్తుంది.

లోలాకుల మోడల్‌

సింగిల్‌ లైన్‌ ముత్యాల బ్రేస్‌లెట్‌కు మధ్య మధ్యలో అందమైన పెండెంట్లను వేలాడేలా జోడిస్తారు. పువ్వులు, నక్షత్రాలు, బంగారు గుండ్లు, గవ్వలు, శంకులు, మువ్వలు, గంటలు, సూర్యుడు, చంద్రుడు... ఇలా ఎన్నో రకాల లోలాకులను జతచేస్తారు. ఈ తరహా బ్రేస్‌లెట్లు క్యాజువల్‌ వేర్‌మీద ట్రెండీ లుక్‌నిస్తాయి.

స్టోన్స్‌ మోడల్‌

బంగారం, వెండి, పంచలోహాలతో రూపొందించిన బ్రేస్‌లెట్‌కు మధ్య మధ్యలో ముత్యాలు, అందంగా మెరిసే రాళ్లను చక్కని ఆకృతిలో పొదిగి ఈ మోడల్‌ను రూపొందిస్తారు. ట్రెండీగా, గ్లామరస్‌గా కనిపిస్తూ సాయంకాలపు పార్టీల్లో ధరించడానికి అనువుగా ఉంటుంది ఈ బ్రేస్‌లెట్‌. చీరలు, లెహంగాలు, సల్వార్‌సూట్లపైన రఽగాండ్‌లుక్‌నిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 19 , 2026 | 02:00 AM