వీటితో దోమలు మాయం...
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:16 AM
వర్షాకాలంలో దోమల బెడదతో నిద్ర కరవవడమే కాదు రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని సులువుగా తరిమేసే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం...
వర్షాకాలంలో దోమల బెడదతో నిద్ర కరవవడమే కాదు రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని సులువుగా తరిమేసే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం...
మట్టి ప్రమిదలో రెండు కర్పూరం బిళ్లలు, నాలుగు చెంచాల వేప నూనె వేసి ఓ ఒత్తిని ఉంచి వెలిగిస్తే ఆ వాసనకు దోమలన్నీ బయటికి వెళ్లిపోతాయి.
నిమ్మకాయను సగానికి కోసి దానిపై అయిదారు లవంగాలు గుచ్చి కిటికీల వద్ద ఉంచితే దోమలు రావు.
ఒక స్ర్పే బాటిల్‌లో సగానికి పైగా నీటిని నింపి అందులో ఆరు చుక్కల లావెండర్ లేదా యూకలిప్టస్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి ఇల్లంతా స్ర్పే చేస్తుంటే దోమల బెడద తగ్గుతుంది.
తులసి, పుదీనా, లావెండర్, రోజ్‌మేరీ మొక్కల కుండీలను కిటికీల వద్ద గదుల్లో బాల్కనీల్లో ఏర్పాటు చేసుకుంటే ఆ పరిసరాల్లోకి దోమలు రావు.
కాఫీ గింజలను బాగా ఎండబెట్టి గదుల మూలల్లో, మంచం కింద, కిటికీల అరల్లో ఉంచినా దోమలు రావు.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు