Share News

చెక్కుచెదరని అందం కోసం...

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:14 AM

మేకప్‌ విధానాలు కూడా కాలానుగుణ మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి పోకడకు తగ్గట్టు మేకప్‌ వేసుకునే పద్ధతులను కూడా మార్చుకుంటూ ఉండాలి. అందుకోసం...

చెక్కుచెదరని అందం కోసం...

మేకప్‌

మేకప్‌ విధానాలు కూడా కాలానుగుణ మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి పోకడకు తగ్గట్టు మేకప్‌ వేసుకునే పద్ధతులను కూడా మార్చుకుంటూ ఉండాలి. అందుకోసం...

విల్లుల్లాంటి కనుబొమలు

ముఖాకృతికి నప్పే కనుబొమల ఆకృతి పట్ల అవగాహన పెంచుకోవాలి. తర్వాత నిపుణుల సహాయంతో కనుబొమలను విల్లుల్లా తీర్చిదిద్దుకుని నలుగురినీ ఆకట్టుకోవచ్చు. అలాగే కనుబొమలను దిద్దుకోవడం కోసం నలుపు రంగుకు బదులుగా ముదురు గోఽధుమ రంగు ఐబ్రో పెన్సిల్‌ ఎంచుకోవాలి.

ఐషాడో ఇలా...

తాజాగా ‘పేల్‌ బ్లూ పెర్ల్‌’, ‘స్మోకీ నేవీ’ రంగులు వాడుకలోకొచ్చాయి. వీటిలో దేన్ని ఎంచుకున్నా, కనురెప్పలు ఎబ్బెట్టుగా కనిపించకుండా ఐలైనర్‌లో కలిసిపోయేలా ఐషాడోను పూసుకోవాలి. కనురెప్పలు దించినా, లేపినా కంటి అందం చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలి.

లిప్‌ లైనర్‌తో...

లైనర్‌తో పెదవులను అంచులను తీర్చిదిద్ది, పలుచగా లిప్‌స్టిక్‌ అద్దుకోవడమే తాజా పోకడ. అయితే ఎంచుకునే లిప్‌ లైనర్‌ వీలైనంత ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. పెదవుల అంచుల దగ్గరి నుంచి మొదలుపెట్టి, మధ్య వరకూ లైనర్‌ గీసుకుని, లేత గులాబీ, పీచ్‌ రంగు లిప్‌స్కిట్స్‌ పెదవులకు పలుచగా అద్దుకోవాలి.

గోళ్లు మిలమిల

నెయిల్‌ ఆర్ట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. డ్రస్‌తో మ్యాచ్‌ అయ్యే రంగులతో పాటు, డిజైన్‌ను కూడా మ్యాచ్‌ చేసుకోవడం తాజా పోకడ. ఇందుకోసం క్రిస్టల్స్‌, బీడ్స్‌, చమ్కీలను ఎంచుకోవచ్చు.

చమ్కీ చమక్కు

ఐషాడో, లిప్‌ కలర్‌, బ్లష్‌.. వీటన్నిట్లో మెరుపు కలిసి ఉంటే అదొక అదనపు హంగు అవుతుంది. పార్టీలు, పెళ్ళిళ్లు లాంటి వేడుకల్లో, ఈవెంట్లలో ఇలాంటి మేక్‌పను ఎంచుకుంటే మెరుపులు మెరపించవచ్చు. ఈ ట్రెండ్‌కు ఆదరణ ఎప్పటికీ ఉండేదే!

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 01:14 AM