కళ్లు చెదిరే కాంతా కాటన్
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:28 AM
అన్ని కాలాలకూ అనువైన వస్త్రం కాటన్. అయితే రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకుంటే విశిష్టమైన, చేత్తో రూపొందించిన కాటన్ దుస్తులనే ఎంచుకోవాలి...
ఫ్యాషన్
అన్ని కాలాలకూ అనువైన వస్త్రం కాటన్. అయితే రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకుంటే విశిష్టమైన, చేత్తో రూపొందించిన కాటన్ దుస్తులనే ఎంచుకోవాలి. ప్రత్యేకించి రన్నింగ్ స్టిచ్ ఎంబ్రాయిడరీతో రూపొందే కాంతా కాటన్ కుర్తాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
బెంగాల్, బంగ్లాదేశ్‌కే పరిమితమైన కాంతా కాటన్ చారిత్రక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలు సుతిమెత్తని, పలుచని కాటన్ వస్త్రాలను కలిపి చీరలు రూపొందించేవారు. ఆ చీరలను కలిపి కుట్టడం కోసం ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించేవారు. ఆ కుట్టు పేరే ‘కాంతా’. చిన్నదిగా, నేరుగా కొనసాగే కాంతా కుట్టును నేడు, ఔట్‌లైన్‌గా లేదా పూలు, పక్షులు, జామెంట్రీ డిజైన్లతో కూడిన మోటిఫ్స్ కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు.
చీరలు, కుర్తీల్లో...
రీసైకిల్ చేసిన చీరలతో సంప్రదాయ కాంతా వస్త్రాలు రూపొందుతూ ఉంటాయి. ఆధునిక కళాకారులు, డిజైనర్లు నేడు నూరు శాతం కాటన్, సిల్క్ కాటన్, స్ర్కీన్ ప్రింటెడ్ కాటన్, బ్లాక్ ప్రింటెడ్ కాటన్ వస్త్రాలతో కాంతా వస్త్రాలను రూపొందిస్తున్నారు. కాంతా కుట్టు ప్రత్యేకత దాని దారంలో, డిజైన్‌లో దాగి ఉంటుంది. ఈ కుట్టుతో రూపొందించిన పలు రకాల డిజైనర్ చీరలు, కుర్తీలు కూడా నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి కుర్తీలు అత్యంత ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి.
ఇలా ధరిస్తే...
పెయిరింగ్: తెల్ల పలాజాతో కలిపి ధరిస్తే కాంతా కుర్తీ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. పలువురిని ఆకట్టుకుంటుంది
యాక్సెసరీస్: ఆక్సిడైజ్డ్ సిల్వర్ జువెలరీ చక్కగా మ్యాచ్ అవుతుంది
చెప్పులు: కాళ్లకు ఫ్లాట్స్, కొల్హాపురి చెప్పులు బాగుంటాయి
వాషింగ్: కాంతా కుర్తీలను వాషింగ్ మెషిన్‌లో ఉతకకకుండా, చేత్తో సున్నితంగా శుభ్రం చేసి, నీడపట్టున ఆరేయాలి
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..