ఆఫర్లు వాపసు, ఉద్యోగుల తొలగింపు ఇప్పుడేమి చేయాలంటే..!
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:05 AM
ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి సంస్థల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఇచ్చిన ఆఫర్లకు కూడా దిక్కు ఉండటం లేదు....
ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్
ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి సంస్థల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఇచ్చిన ఆఫర్లకు కూడా దిక్కు ఉండటం లేదు.
ఏఐ పేరుతో చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ముఖ్యంగా జాబ్ మార్కెట్‌లో ఆస్థిరత
నెలకొన్నప్పుడు స్ఠిర గమ్యం నుంచి చురుకుగా అడుగులు అవసరానుగుణంగా వేయగలగాలి. మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి, పరిస్థితులకు తగ్గట్టు మారాలి. అవసరమైతే కొత్త కోర్సుల్లో చేరాలి, తగు శిక్షణ పొందాలి. అదెలాగంటే...
క్యాంపస్ నుంచి జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు మొదటి ఆఫర్‌ను పునర్నిర్వచించుకోవాలి. ట్రాన్సఫరబుల్ స్కిల్స్ నేర్చుకునేదిగా దానిని భావించాలి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డేటా అనాల్సిస్ వంటివి ఇందులోకి వస్తాయి. అంతేతప్ప అదే జీవితాంతం కొనసాగే కెరీర్ అనుకోరాదు. ఈ ధోరణి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అనూహ్య విధానాల వైపు ఆలోచనలు మళ్ళేందుకు ద్వారాలను తెరుస్తుంది.
ఫ లక్ష్యానికి అనువైన సమాంతర ఆప్షన్లు చూడాలి. ఏదో ఒకటే పాత్ర పోషించేందుకు ఫిక్స్ కాకూడదు. అదే రూట్‌లో అందుబాటులో ఉన్న వాటివైపు దృష్టిసారించాలి. ఉదాహరణకు సైకాలజీ గ్రాడ్యుయేట్లు కార్పొరేట్ ట్రైనింగ్ అని కూర్చోకూడదు. తాత్కాలిక ఉద్యోగాలు లేదంటే పెయిడ్ ఇంటర్న్‌షి్‌పలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
ఫ మాంద్యంలోనూ స్థిరంగా ఉండే రంగాల వైపు మళ్ళడం మరో ఆప్షన్. హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, ప్రభుత్వ, వినియోగ రంగాలు, ఎడ్యుటెక్ వంటివి ఎంచుకోవచ్చు. కల కనని జాబ్ కూడా స్థిరత్వాన్ని అందించవచ్చు. ప్రొఫెషనల్ నెట్ వర్క్ ఏర్పాటుకు సహాయపడవచ్చు.
కరెంట్ గ్రాడ్యుయేట్స్
జాబ్ మార్కెట్లోకి ఇప్పటికే వచ్చేసిన గ్రాడ్యుయేట్లు ఈ వర్గంలోకి వస్తారు. యాంటీఫ్రాజిల్ స్కిల్స్ అంటే అవసరాలకు అనుగుణ్యమైనవి నేర్చుకోవాలి. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చేంజ్ మేనేజ్‌మెంట్, డేటా స్టోరీటెల్లింగ్, ఆటోమేషన్ టూల్స్(జేపియర్, పవర్ క్వెరీ) వంటి వాటిలో శిక్షణ పొందాలి.
ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ నెట్‌వర్క్‌ను పటిష్టపర్చుకోవాలి. ప్రస్తుతం జాబ్ చేస్తున్న కంపెనీపై మాత్రమే నమ్మకం పెట్టుకోరాదు. ఇతర పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేస్తున్న మీ సహచరులతో కాంటాక్ట్‌లు పెట్టుకోవాలి. మీ తదుపరి జాబ్ మీరున్న చోటే కాకుండా కోవర్కర్ నుంచి రావచ్చు కూడా.
మీ అవకాశాల రాడార్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలి. పనిచేస్తున్న చోట సంతోషంగా ఉన్నప్పటికీ ఆరు నుంచి తొమ్మిది నెలలకు ఒకసారి ఇంటర్వ్యూకి హాజరుకావాలి. ఫలితంగా మీ రెజ్యూమె షార్ప్‌గా ఉంటుంది. లే ఆఫ్ మిమ్మల్ని ముట్టుకోడానికి ముందే కీలక పాత్రలోకి మారవచ్చు.
ఆర్థిక స్థితిగతులు చాలా ముఖ్యం. రాబోయే మూడు నుంచి ఆరునెలల సమయంలో అత్యవసర ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని ముందే సిద్ధం చేసుకోవాలి. ఇలా ఉంచుకుంటే మానసికంగా భద్రత లభిస్తుంది. పనికిమాలిన ఆఫర్లను తిరస్కరించే దమ్ము సమకూరుతుంది. సరైన ఆఫర్ వచ్చే వరకు ఆగే ధైర్యం లభిస్తుంది.
70/30 నిబంధన - అటు ఫ్రెషర్లకు, ఇటు ఉద్యోగులకూ ఇద్దరికీ వర్తిస్తుంది. 70 శాతం స్ట్రక్చర్డ్ యాక్షన్స్ అంటే అప్లికేషన్స్, స్కిల్ కోర్సులు, నెట్‌వర్కింగ్ ఈవెంట్స్‌కు కేటాయించుకోవాలి. మిగిలిన 30 శాతం ఎక్స్‌ప్లొరేటరీ అంటే సమాచారంతో వచ్చిన ఇంటర్వ్యూలు, సైడ్ ప్రాజెక్టులు, మీట్‌ప్సకు హాజరుకావడం వంటివి. ఇందులో 30 శాతం నుంచే అనూహ్యంగా ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది.
ఒక పని రేపట్నించే మొదలుపెట్టండి. ఏదో ఒక జాబ్ టైటిల్ తీసుకోండి. అది ఊహాజనితమే కావచ్చు. ఆ జాబ్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులను లింక్డిన్ నుంచి ఎంచుకోండి. వాళ్ళ కెరీర్ తీరును ముఖ్యంగా ఎగుడుదిగుడులు సహా అధ్యయనం చేయండి. పదిహేను నిమిషాల చాట్ కోసం మెసేజ్ చేయండి. ఇది ఒక ఆర్టికల్ చదవడానికి మించిన అనుభవాన్ని కలుగజేస్తుంది.
కెరీర్ ఆరంభంలోనే జాబ్‌ను కోల్పోతే, మీ సామర్థ్యాలను శంకిస్తూ కఠినమైన తీర్పులు ఇచ్చేసుకోవద్దు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు అందరూ ఒకే రకమైన అనుభవాలను ఎదుర్కొంటారు.
వెన్వంటనే చేయదగ్గ పనులతో సేఫ్టీ నెట్ అల్లుకోవాలి. అంటే ట్యూటరింగ్, ఫ్రీలాన్స్ వేదికలు(అ్‌పవర్క్, ఫివెర్ర్), పార్ట్‌టైమ్ రిటైల్, లేదంటే రిమోట్ గిగ్స్ - యూజర్ టెస్టింగ్ వంటివి చేపట్టవచ్చు. డబ్బుల కోసం ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇదో తాత్కాలిక ఉపశమనం.
ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలి. అందుకు నిర్ధుష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. ఉదయం లేచిన తరవాత మొదటి అరగంట స్ర్కీన్ చూసే పని పెట్టుకోరాదు. తదుపరి మొదటి గంట సేపు స్కిల్ బిల్డింగ్(ఒక కోర్సు మాడ్యూల్), భోజనం, నెట్‌వర్కింగ్ మెసేజె్‌స/అప్లికేషన్స్/ పోర్ట్‌ఫోలియో వర్క్, సాయంత్రానికి ముందు నుంచి వరుసగా ఎక్స్‌ర్‌సైజ్‌లు, హాబీ, ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో సంభాషించడం, కుకింగ్, గేమింగ్‌కు కేటాయించుకోవాలి. రోజులో రెండు గంటల సమయాన్ని తప్పనిసరిగా కొత్తవి నేర్చుకునేందుకు కేటాయించుకోవాలి.
ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అన్న టాగ్‌ని చాలా ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. గ్యాప్‌ను అప్‌స్కిల్లింగ్ కోసం ఎలా వినియోగించుకున్నారు అన్నది చెప్పగలగాలి. ఇంటర్న్‌షిప్, అప్రెంటి్‌సషిప్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనులు చేయవచ్చు.
మీ ఇన్‌స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ కౌన్సెలింగ్ సెంటర్‌ను సంప్రదిస్తే ఉచితంగా కొన్ని ప్రయోజనాలు సమకూరుతాయి. రెజ్యూమె రెవ్యూ, జాబ్ బోర్డ్ సదుపాయం వంటివి గ్రాడ్యుయేషన్ తదుపరి రెండేళ్ళ వరకు అందుబాటులో ఉంటుంది.
స్ట్రెస్ ట్రాప్‌లో పడకూడదనుకుంటే ముందు రోజంతా పైజామాలతో గడిపేయవద్దు. మీ దరఖాస్తులు తిరస్కరణకు గురైతే భయాందోళనలకు గురికావద్దు. మరింత మంచి ఆఫర్ ముందు ఉందని గ్రహించండి.
దీర్ఘకాలిక నిద్రలేమి లేదా ఆకలిలో మార్పులు, తనను తాను బాధించుకోవాలని భావించడం లేదా నిరుపయోగమనే ఆలోచనలు, రోజుల తరబడి మంచం దిగకపోవడం వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో బందీ కావద్దు.
నిరాశ నిస్పృహల నుంచి బైటపడేందుకు ఈ రోజుల్లో జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్ సదుపాయలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
మీరు సక్సె్‌సపుల్ పర్సన్ అనుకున్న వ్యక్తి కూడా తన కెరీర్ మొత్తంలో ఆరంభంలో లేదంటే మధ్యలో పనికి దూరమై ఉండితీరుతాడు. జీవితమనే సుదీర్ఘ కథనంలో ఉద్యోగం పోవడం అనేది ఒక పేరాగ్రాఫ్ మాత్రమే.
చేపట్టిన వృత్తి లేదా పనిని - మీ సామర్థ్యాన్ని వేరుగా చూడాలి. గ్రాడ్యుయేట్స్ చాలా మంది తమ మొదటి జాబ్ ఆఫర్‌ను ఆత్మగౌరవంతో ముడిపెడుతుంటారు. అది కరెక్ట్ కాదు. లేఆఫ్, రీస్ట్రక్చరింగ్స్ చాలా అరుదుగా వ్యక్తిగత ప్రతిభతో కలగలుస్తాయి. జూనియర్ రోల్స్ ప్రత్యేకించి ఇది జరుగుతుంది. మీ డిగ్రీ, నైపుణ్యాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఈ సమయంలో వదిలిపెట్టిన జాబ్‌తో సంబంధంలేని మూడు మంచి విషయాలు రాసిపెట్టుకోవాలి. వాటిని ప్రతి రోజూ చదువుకోవాలి.
ఉద్వేగపరమైన ఒత్తిడికి డబ్బు లేకపోవడం అతి పెద్ద కారణమవుతుంది. ఇంటి అద్దె, ఆహారం, రవాణా, కనీస అప్పులు తీర్చే మొత్తం వంటివి ఆరు నుంచి ఎనిమిది వారాలకు సమకూర్చుకున్నా సరిపోతుంది. తదుపరి స్మార్ట్ స్టెప్ వేసేందుకు ఇది తోడ్పడుతుంది. వివిధ చందాలు కట్టడం, బైట తినడం వంటివాటిని తాత్కాలికంగా ఆపేయండి. ఈ చర్య ఏమీ శిక్ష కాదు, దీంతో ప్రశాంతత లభిస్తుంది.
ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు
డైరెక్టర్, ఎన్‌ఐటీ, రాయ్‌పూర్
ఇవి కూడా చదవండి:
ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్
ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..